
పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కి ఉండే క్రేజ్, పాపులారిటీ, ఆదరణ చాలా తక్కువ. అందుకే మహిళా క్రికెటర్లకు చెల్లించే వేతనాల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ మెన్ క్రికెటర్లకు ఆరాధించే క్రికెట్ ఫ్యాన్స్‌లో చాలామంది మహిళా క్రికెటర్ల పేర్లు కూడా తెలీదు. అయితే ఓ మహిళా క్రికెటర్, దీన్ని మొత్తం మార్చేసింది. ఆమె వుమెన్స్ టీమ్ వన్డే, టెస్టు కెప్టెన్ మిథాలీ రాజ్...
వన్డేల్లో 63 హాఫ్ సెంచరీలు చేసి అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మిథాలీరాజ్, 24 ఏళ్లుగా క్రికెట్‌లో కొనసాగుతోంది. సచిన్ టెండూల్కర్ కంటే సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్ కొనసాగిస్తూ, మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో ఉంది మిథాలీ రాజ్...
మిథాలీ రాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్ బయోపిక్ మూవీ ‘శభాష్ మీతూ’. తాప్సీ పన్ను ఈ మూవీలో మిథాలీ రాజ్ పాత్రలో కనిపించనుంది. ‘శెభాష్ మీతూ’ ట్రైలర్‌ను సోమవారం విడుదల చేసింది చిత్ర యూనిట్...
‘ఆటోగ్రాఫ్’, ‘బైసే స్రాబన్’, ‘బేగం జాన్’ వంటి 20కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీజిత్ ముఖర్జీ డైరెక్షన్‌లో ‘శెభాష్ మీతూ’ మూవీ రూపొందింది. ప్రియ అవెన్ కథను అందించగా, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదీ సంగీతాన్ని అందిస్తున్నాడు...
మిథాలీ రాజ్ క్రికెట్ కెరీర్ సాధించిన రికార్డులను హైలెట్ చేస్తూ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మహిళల క్రికెట్‌లో వరుసగా 7 హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా, అతి పిన్న వయసులో టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా మిథాలీ సాధించిన రికార్డులను ఈ టీజర్‌లో చూపించారు.
గత ఏడాది నవంబర్‌లోనే ‘శెభాష్ మీతూ’ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ఫిబ్రవరి 4న ఈ సినిమాని విడుదల చేయాలని భావించినా, వీలు కాలేదు. త్వరగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనుంది చిత్ర యూనిట్.
నాలుగు వరల్డ్ కప్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన మిథాలీ రాజ్, ప్రస్తుతం వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాల్గొంటోంది. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఆమెకి ఇదే ఆఖరి వరల్డ్ కప్. అలాగే మిథాలీ రాజ్‌తో పాటు కలిసి 200 వన్డేలు ఆడిన జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా అనుష్క శర్మ ప్రధాన పాత్రలో ‘చెడ్డా ఎక్స్‌ప్రెస్’ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే...
ఈ మధ్య బాలీవుడ్‌లో విడుదలైన బయోపిక్స్‌కి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సైనా నెహ్వాల్ బయోపిక్‌తో పాటు కపిల్ దేవ్ బయోపిక్ మూవీ ‘83’ కూడా బాక్సిఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టలేకపోయింది.