
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా సీజన్ మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానుంది. మహారాష్ట్ర వేదికగా నాలుగు స్టేడియాలలో పది జట్లు 70 లీగ్ మ్యాచులు ఆడనున్నాయి. కరోనా దృష్ట్యా బయో బబుల్ లో జరుగనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ కు అన్ని అడ్డంకులు తొలగిపోయిన నేపథ్యంలో.. ఐపీఎల్-15వ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా..? అని అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు కండ్లల్లో వత్తులేసుకుని మరీ వేచి చూస్తున్నారు. ఈ మేరకు అన్ని జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఆటగాళ్లకు ‘శిక్షణ’ ఇచ్చేందుకు అన్ని జట్ల కోచింగ్, సహాయక సిబ్బంది రెడీ అయ్యారు.
ఇప్పటికే జట్లతో చేరుకున్న ఆయా జట్ల హెడ్ కోచ్ లు, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కన్సల్టెంట్లు, టీమ్ డైరెక్లర్లు, అసిస్టెంట్ కోచ్ లతో ఆటగాళ్లు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ ఏ జట్టుకు ఎవరు కోచ్ లుగా వ్యవహరిస్తున్నారో ఇక్కడ చూద్దాం.
ముంబై ఇండియన్స్..
ఐపీఎల్ లో ఐదు సార్లు విజేత ముంబై ఇండియన్స్ కు పటిష్టమైన కోచింగ్ సిబ్బంది ఉంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ‘ఐకాన్’గా ఉన్న ఈ జట్టుకు శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్దనె హెడ్ కోచ్ గా ఉన్నాడు.
- జహీర్ ఖాన్ : డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్
-షేన్ బాండ్ : బౌలింగ్ కోచ్
- రాబిన్ సింగ్ : బ్యాటింగ్ కోచ్
- జేమ్స్ పమ్మెంట్ : ఫీల్డింగ్ కోచ్
- పాల్ చాంప్మన్ : స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్
కోల్కతా నైట్ రైడర్స్..
ఐపీఎల్ లో రెండు సార్లు విజేత కోల్కతా నైట్ రైడర్స్ కు బ్రెండన్ మెక్ కల్లమ్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.
- అభిషేక్ నాయర్ : అసిస్టెంట్ కోచ్
- డేవిడ్ హస్సీ : అసిస్టెంట్ కోచ్
- ఒంకార్ సాల్వి : అసిస్టెంట్ బౌలింగ్ కోచ్
- జేమ్స్ ఫాస్టర్ : ఫీల్డింగ్ కోచ్
- క్రిస్ డొనాల్డ్సన్ : స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్
- కమలేశ్ జైన్ : హెడ్ సైకోథెరపిస్టు
- ఏఆర్ శ్రీకాంత్ : ఫర్మార్మెన్స్ అనలిస్టు
- వేన్ బెంట్లీ : టీమ్ మేనేజర్
- భరత్ అరుణ్ : బౌలింగ్ కోచ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గని జట్లలో ఒకటిగా అపప్రద మూటగట్టకున్న ఆర్సీబీకి సంజయ్ బంగర్ హెడ్ కోచ్ గా ఉన్నాడు.
- మైక్ హెస్సెన్ : డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్
- శ్రీధరన్ శ్రీరామ్ : బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్
- ఆడమ్ గ్రీఫిత్ : బౌలింగ్ కోచ్
- ఎం. రంగరాజన్ : హెడ్ ఆఫ్ స్కౌటింగ్ అండ్ ఫీల్డింగ్ కోచ్
- ఎవాన్ స్పీచ్లీ : టీమ్ ఫిజియో
- నవీన్ గౌతమ్ : స్పోర్ట్స్ మేనేజర్ థెరపిస్ట్
- ప్రథమేశ్ మిశ్రా : చైర్మెన్, ఆర్సీబీ
ఢిల్లీ క్యాపిటల్స్..
ఆర్సీబీ మాదిరిగానే ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గని జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్న ఈ జట్టు కు రికీ పాంటింగ్ హెడ్ కోచ్ గా ఉన్నాడు.
- షేన్ వాట్సన్ : అసిస్టెంట్ కోచ్
- అజిత్ అగార్కర్ : అసిస్టెంట్ కోచ్
- ప్రవీణ్ ఆమ్రే : అసిస్టెంట్ కోచ్
- జేమ్స్ హోప్స్ : ఫాస్ట్ బౌలింగ్ కోచ్
- దనంజయ కౌశిక్ : అసిస్టెంట్ ఫిజియో
- పాట్రిక్ ఫర్హత్ : ఫిజియో
- శ్రీరామ్ సోమయాజుల : టీమ్ అనలిస్టు
సన్ రైజర్స్ హైదరాబాద్..
ఐపీఎల్ లో రెండు సార్లు కప్ కొట్టిన ఎస్ఆర్హెచ్ కు టామ్ మూడీ హెడ్ కోచ్ గా పని చేస్తున్నాడు.
- సైమన్ కటిచ్ : అసిస్టెంట్ కోచ్
- హేమాంగ్ బదానీ : ఫీల్డింగ్ కోచ్
- ముత్తయ్య మురళీధరన్ : స్పిన్ బౌలింగ్ కోచ్
- పేస్ బౌలింగ్ కోచ్ : డేల్ స్టెయిన్
- బ్యాటింగ్ కోచ్ : బ్రియాన్ లారా
పంజాబ్ కింగ్స్..
జట్టు పేరు, కెప్టెన్లను మార్చినా తలరాత మారని ఫ్రాంచైజీ ఏదైనా ఉందంటే అది పంజాబ్ కింగ్సే.. ఇప్పటివరకు ఆర్సీబీ, ఢిల్లీ మాదిరిగానే పంజాబ్ కూడా కప్ కొట్టలేదు. అనిల్ కుంబ్లే ఈ జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నాడు.
- డేమియన్ రైట్ : బౌలింగ్ కోచ్
- జులైన్ వుడ్ : బ్యాటింగ్ కన్సల్టెంట్
- జాంటీ రోడ్స్ : అసిస్టెంట్ కోచ్
- ప్రభాకర్ : అసిస్టెంట్ ఫీల్డింగ్ కోచ్
- అడ్రైన్ లె రౌక్స్ : స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్
- అవినాష్ వైద్య : జనరల్ మేనేజర్ క్రికెట్ ఆపరేషన్స్
- ఆశిష్ తులి : టీమ్ అనలిస్టు
రాజస్థాన్ రాయల్స్..
ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) విజేత రాజస్థాన్ కు శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర హెడ్ కోచ్ గాక పనిచేస్తున్నాడు.
- ట్రెవర్ పెన్నీ : అసిస్టెంట్ కోచ్
- అమోల్ మజుందార్ : బ్యాటింగ్ కోచ్
- స్టెఫాన్ జోన్స్ : హై పర్ఫార్మెన్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్
- సాయిరాజ్ బహుతులే : స్పిన్ బౌలింగ్ కోచ్
- లసిత్ మలింగ : ఫాస్ట్ బౌలింగ్ కోచ్
- దిశాంత్ యజ్ఞిక్ : ఫీల్డింగ్ కోచ్
లక్నో సూపర్ జెయింట్స్..
ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్టు లక్నో.. కెఎల్ రాహుల్ సారథిగా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు జింబాబ్వే మాజీ సారథి ఆండీ ఫ్లవర్ హెడ్ కోచ్ గా ఉన్నాడు.
- గౌతం గంభీర్ : మెంటార్
- విజయ్ దహియా : అసిస్టెంట్ కోచ్
- ఆండి బికెల్ : బౌలింగ్ కోచ్
- రిచర్డ్ హల్సల్ : ఫీల్డింగ్ కోచ్
- వారెన్ ఆండ్రూస్ : స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్
గుజరాత్ టైటాన్స్..
లక్నో తో పాటు ఈ ఏడాది ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న జట్టు గుజరాత్ టైటాన్స్. హర్థిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టుకు ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్ గా ఉన్నాడు.
- గ్యారీ కిర్స్టెన్ : బ్యాటింగ్ కోచ్ అండ్ మెంటార్
- ఆశిస్ కపూర్ : స్పిన్ బౌలింగ్ కోచ్ అండ్ స్కౌట్
చెన్నై సూపర్ కింగ్స్..
భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై జట్టు ఐపీఎల్ లో 4 సార్లు విజేత. ఈ సీజన్ తో ధోని ఐపీఎల్ కెరీర్ కూడా ముగింపునకు చేరుకుంటున్నది. ఈ జట్టు కు స్టీఫెన్ ఫ్లెమింగ్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.
- మైకెల్ హస్సీ : బ్యాటింగ్ కోచ్
- లక్ష్మీపతి బాలాజీ : బౌలింగ్ కోచ్
- ఎరిక్ సిమన్స్ : బౌలింగ్ కన్సల్టెంట్
- రాజీవ్ కుమార్ : ఫీల్డింగ్ కోచ్
- టామీ సిమ్సెక్ : పిజియోథెరఫిస్టు
- గ్రెగరీ కింగ్ : ట్రయినర్