MI vs SRH : 'ముంబై ఇండియ‌న్స్ చేసిన త‌ప్పు అదే.. '

By Mahesh Rajamoni  |  First Published Mar 28, 2024, 2:00 AM IST

IPL 2024, SRH vs MI: పవర్‌ప్లేలో స్టార్ బౌల‌ర్ జస్ప్రీత్ బుమ్రాకు బౌలింగ్ చేసే ఛాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముంబైతో జ‌రిగిన మ్యాచ్ లో హైద‌రాబాద్ టీమ్ ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక జ‌ట్టు స్కోర్ ను న‌మోదుచేసింది. 


IPL 2024, SRH vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా 8వ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్-స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో హైద‌రాబాద్ బ్యాట‌ర్లు ముంబై బౌలింగ్ ను చెడుగుడు ఆడుకున్నారు. రికార్డుల మోత మోగించారు. 31 ప‌రుగుల తేడాతో ముంబైపై హైద‌రాబాద్ విజ‌యం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో ముంబై చేసిన అతిపెద్ద త‌ప్పును ఎత్తిచూపాడు స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్. హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ లో అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొడుతూ.. 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. 2013లో పూణె వారియర్స్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేసిన 263/5 ప‌రుగుల రికార్డును అధిగ‌మించింది.

ఈ మ్యాచ్ లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హైద‌రాబాద్ త‌ర‌ఫున  ఆస్ట్రేలియా వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ (62), యంగ్ ప్లేయ‌ర్ అభిషేక్ శర్మ (63) ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపారు.  ఆ త‌ర్వాత ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టారు. అభిషేక్ శర్మ 16 బంతుల్లో అర్ధ సెంచరీకి ముందు ట్రావిస్ హెడ్ 18 బంతుల్లో ఫిఫ్టీని విజృంభించడంతో హైద‌రాబాద్ టీమ్ వేగవంతమైన యాభై రికార్డు మ్యాచ్‌లో రెండుసార్లు బద్దలైంది.

Latest Videos

అలాగే, ఒక జ‌ట్టుగా ఐపీఎల్ లో అత్య‌ధిక స్కోర్ చేసిన బెంగ‌ళూరు రికార్డును సైతం హైదరాబాద్ బ‌ద్ద‌లు కొట్టింది. ఈ మ్యాచ్ లో 34 బంతుల్లో అజేయంగా 80 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్.. ముంబై ఓట‌మికి కార‌ణంగా ఉన్న అతిపెద్ద త‌ప్పిదాన్ని ప్ర‌స్తావించాడు. క్లాసెన్ ప్రత్యర్థి వ్యూహాన్ని కూడా ప్ర‌స్తావిస్తూ.. పవర్‌ప్లేలో తమ అత్యుత్తమ బౌలర్ జ‌స్ప్రీత్ బుమ్రాను ఉపయోగించకపోవడం ద్వారా ముంబై త‌మ అవకాశాన్ని కోల్పోయింద‌ని పేర్కొన్నాడు. "పవర్‌ప్లే లోపల అతనిని (బుమ్రా) బౌలింగ్ చేయకపోవడం ద్వారా ముంబై ముందస్తుగా ట్రిక్‌ను కోల్పోయారని నేను భావిస్తున్నాను. మాకు అత్యుత్తమ స్ట్రైకర్‌లు లభించారు. వారు తమ అత్యుత్తమ బౌలర్‌లను ఉపయోగించలేదు. చివరిలో నాతో పాటు నా ఉత్తమ సహచరుడు ఉండటం చాలా అద్భుతంగా ఆడాడు" అని క్లాసెన్ పేర్కొన్నాడు.

'హార్దిక్ పాండ్యా ఏం కెప్టెన్సీ అయ్యా అది.. ! ఇలాగేనా.. '

click me!