
MI vs SRH : ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 31 పరుగుల తేడాతో హైదరాబాద్ టీమ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బ్యాటర్లు ధనాధన్ ఇన్నింగ్స్ అదరగొట్టారు. అనేక రికార్డులు బద్దలు కొట్టారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీమ్ 20 ఓవర్లలో 277 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ ముంబై బౌలింగ్ ను చెడుగుడు ఆడుకున్నారు. ట్రావిస్ హెడ్ 62, అభిషేక్ శర్మ 63, ఐడెన్ మర్క్రమ్ 42, క్లాసెన్ 80 పరుగులతో రాణించారు.
278 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ వరకు తమ పోరాట పటిమను ప్రదర్శించింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఆరంభం అందించారు. రోహిత్ శర్మ 26, ఇషాన్ 34 పరుగులు చేశారు. నమన్ 30 పరుగులతో మెరిశాడు. తెలుగు కుర్రాడ్ తిలక్ వర్మ ధనాధన్ ఇన్నింగ్స్ తో ముంబైకి ఆశలు పెంచాడు. కానీ, జట్టుకు విజయం దక్కలేదు. తిలక్ తన 64 పరుగుల ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. చివరలో టిమ్ డెవిడ్ (42), హార్దిక్ పాండ్యా(24)లు మెరిసిన ముంబై విజయాన్ని అందుకోలేక పోయింది. 20 ఓవర్లలో 246-5 పరుగులు చేయగలిగింది. రెండు జట్లు కలిపి చేసిన పరుగులు 500 పరుగులు దాటడం మరో విశేషం. ఐపీఎల్ లో ఇదే తొలిసారి.
చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక టీమ్ స్కోర్