చ‌రిత్ర సృష్టించిన హైద‌రాబాద్.. ఐపీఎల్ హిస్ట‌రీలో అత్య‌ధిక టీమ్ స్కోర్

By Mahesh Rajamoni  |  First Published Mar 27, 2024, 11:07 PM IST

Hyderabad vs Mumbai Indians : ఐపీఎల్ 2024 లో హైద‌రాబాద్ టీమ్ త‌న హోం గ్రౌండ్ లో చ‌రిత్ర సృష్టించింది. స‌న్ రైజ‌ర్స్ ఆట‌గాళ్లు ముంబై బౌలింగ్ ను చిత్తూ చేస్తూ ప‌రుగుల వ‌ర‌ద పారించారు. దీంతో 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 277/3 పరుగులు చేసింది.


MI vs SRH : ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్ మ్యాచ్ లో బ్యాట‌ర్స్ ప‌రుగుల వ‌రద పారిస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ ఆట‌గాళ్లు ముంబై బౌలింగ్ ను చిత్తు చేస్తూ బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. రికార్డు హాఫ్ సెంచ‌రీలు సాధించారు. ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ఎలక్ట్రిక్ హాఫ్ సెంచరీలతో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 277/3 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్కోర్ చేసిన టీమ్ గా హైద‌రాబాద్ చ‌రిత్ర సృష్టించింది. అలాగే, ఒక జ‌ట్టుగా క్రికెట్ లీగ్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్కోర్ చేసిన జ‌ట్టుగా కూడా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ చ‌రిత్ర సృష్టించింది.

అంత‌కుముందు ఐపీఎల్ లో అత్య‌ధిక స్కోర్ చేసిన టీమ్ రికార్డు విరాట్ కోహ్లీ టీమ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు పేరు మీద ఉండేది. 2013లో పూణే వారియర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 263/5 ప‌రుగులు చేసింది. 

Latest Videos

ఐపీఎల్ లో అత్యధిక జట్టు స్కోర్లు : 

277/3 -  హైద‌రాబాద్ vs ముంబై, హైదరాబాద్, 2024
263/5 - బెంగ‌ళూరు vs పుణే, బెంగళూరు, 2013
257/5 - ల‌క్నో vs పంజాబ్, మొహాలీ, 2023
248/3 - బెంగ‌ళూరు గుజ‌రాత్, బెంగళూరు, 2016
246/5 - చెన్నై vs రాజ‌స్థాన్, చెన్నై, 2010

హైద‌రాబాద్ దెబ్బ‌కు ముంబైకి దిమ్మ‌దిరిగి మైండ్ బ్లాక్ అయింది.. !

click me!