MIvsDC: ముంబై ‘టాప్’ క్లాస్ ప్రదర్శన... ఢిల్లీ క్యాపిటల్స్‌కి రెండో ఓటమి...

Published : Oct 11, 2020, 11:05 PM IST
MIvsDC: ముంబై ‘టాప్’ క్లాస్ ప్రదర్శన... ఢిల్లీ క్యాపిటల్స్‌కి రెండో ఓటమి...

సారాంశం

హాఫ్ సెంచరీలు చేసిన డి కాక్, సూర్యకుమార్ యాదవ్... 2 వికెట్లు తీసిన రబాడా... సీజన్‌లో రెండో ఓటమి మూటకట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్...

IPL 2020: డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్... ఛాంపియన్ ఆటతీరుతో మరో విజయాన్ని అందుకుంది. టాప్‌లో ఉన్న ఢిల్లీని ఓడించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. రోహిత్ శర్మ 12 బంతుల్లో 5 పరుగులు చేసి అవుట్ కాగా... బర్త్ డే బాయ్ హార్ధిక్ పాండ్యా డకౌట్ అయ్యాడు.

డి కాక్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 32 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 53 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేయగా పోలార్డ్, కృనాల్ పాండ్యా కలిసి లాంఛనాన్ని ముగించారు.అయితే ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం, ముంబై బ్యాట్స్‌మెన్ తొందర పడకపోవడంతో ఆఖరి ఓవర్ దాకా వెళ్లింది మ్యాచ్.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రబాడాకి 2 వికెట్లు దక్కగా, స్టోయినిస్, అక్షర్ పటేల్, అశ్విన్ తలా ఓ వికెట్ తీశారు. 
 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !