DCvsMI: గబ్బర్ హాఫ్ సెంచరీ... స్వల్ప స్కోరుకే పరిమితమైన ఢిల్లీ క్యాపిటల్స్...

Published : Oct 11, 2020, 09:11 PM IST
DCvsMI: గబ్బర్ హాఫ్ సెంచరీ...  స్వల్ప స్కోరుకే పరిమితమైన ఢిల్లీ క్యాపిటల్స్...

సారాంశం

హాఫ్ సెంచరీ చేసిన శిఖర్ ధావన్... 42 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్... సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన అజింకా రహానే...

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. పృథ్వీషా 4 పరుగులే చేసి మొదటి ఓవర్‌లోనే అవుట్ అయ్యాడు. సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడిన అజింకా రహానే 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

శ్రేయాస్ అయ్యర్ 33 బంతుల్లో 5 ఫోర్లతో 42 పరుగులు చేయగా.. శిఖర్ ధావన్ ఐపీఎల్ కెరీర్‌లో 38వ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. స్టోయినిస్ 12 పరుగులు చేసి రనౌట్ కాగా... డెత్ ఓవర్లలను పెద్దగా పరుగులు ఇవ్వకుండా ఢిల్లీని కంట్రోల్ చేశారు ముంబై బౌలర్లు. 
 

ధావన్ 52 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 69 పరుగులు చేయగా, అలెక్స్ క్యారీ 14 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీయగా ట్రెండ్ బౌల్ట్ ఓ వికెట్ తీశాడు. 

 

PREV
click me!

Recommended Stories

Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా