SRHvsRR: రాజస్థాన్ ‘రాయల్’ విక్టరీ... ఆఖర్లో తెవాటియా, రియాన్ పరాగ్ మ్యాజిక్...

By team teluguFirst Published Oct 11, 2020, 7:15 PM IST
Highlights

సీజన్‌లో వరుసగా నాలుగు ఓటముల తర్వాత విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్... 

తెవాటియా, రియాన్ పరాగ్ మెరుపులతో సీజన్‌లో మూడో విజయం...

IPL 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పరాజయాల పరంపరకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. మొదటి రెండు మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత  వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. ఎట్టకేలకు సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌తో మూడో విజయం అందుకుంది ఆర్ఆర్. ఓటమి ఖాయం అనుకున్న సమయంలో యంగ్ బ్యాట్స్‌మెన్ రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్ అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పారు.

159 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్... ఏ దశలోనూ లక్ష్యంవైపు సాగలేదు. 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్‌కు రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్ కలిసి ఆరో వికెట్‌కి 85 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి అద్భుత విజయాన్ని అందించారు.

బెన్ స్టోక్స్ 5 పరుగులకే పెవిలియన్ చేరగా జోస్ బట్లర్ 16, రాబిన్ ఊతప్ప 18 పరుగులు చేశారు. స్టీవ్ స్మిత్ 5 పరుగుల వద్ద రనౌట్ కాగా... సంజూ శాంసన్ 25 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తెవాటియా 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేయగా రియాన్ పరాగ్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశారు...

click me!