ధోనియే మమ్మల్ని గెలిపించాడు : రోహిత్ శర్మ

By Arun Kumar PFirst Published Apr 27, 2019, 4:36 PM IST
Highlights

చెన్నై వేదికగా శుక్రవారం ఐపిఎల్ టోర్నీలో రెండు అత్యుత్తమ జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ  ఐపిఎల్ సీజన్ 12లో వరుస విజయాలతో దూసుకుపోతూ ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లేఆఫ్ బెర్తును ఖాయం చేసుకోడానికి ప్రయత్నిస్తున్న ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఇలా హేమాహేమీ జట్ల మధ్య జరిగిన పోరులో చివరకు ముంబైదే పైచేయిగా నిలిచింది. ఏకంగా 46 పరుగుల తేడాతో ముంబై చేతిలో చెన్నై ఘోర ఓటమిని చవిచూసింది. 

మ్యాచ్ అనంతరం  విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ తమ గెలుపుకు రెండు విషయాలు ప్రధానంగా ఉపయోగపడ్డాయని తెలిపారు. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్ ఆడకపోవడం తమకెంతో ఉపయోగపడిందన్నాడు. అలాగే టాస్ ఓడిపోవడం కూడా మా  మంచికే జరిగిందని రోహిత్ పేర్కొన్నాడు. ఈ రెండు తమ విజయానికి ఎలా ఉపయోగపడ్డాయో రోహిత్ వివరించాడు. 

సొంత మైదానంలో చెన్నైని ఓడించడానికి ఆ జట్టు కెప్టెన్ ధోని ఆడకపోవడం తమకెంతో ఉపయోగపడిందని రోహిత్ అన్నారు. ధోని ఈ మ్యాచ్ ఆడటంలేదని తెలియగానే తమకు  ఎక్కడలేని ఉత్సాహం  వచ్చిందన్నాడు. అతడు కేవలం జట్టులో వుంటే చాలు మిగతా ఆటగాళ్లకు దైర్యంగా వుంటుంది. ఇలా అతడు అనారోగ్యం కారణంగా తమతో జరిగిన మ్యాచ్ లో ఆడకపోవడంతో ముందే ఢీలాపడ్డ ఆటగాళ్లు చేజింగ్ చేయాల్సి వచ్చేసరికి మరింత ఇబ్బందిపడ్డారు. దీంతో వారిని ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమైన  తమ బౌలర్లు వెంటవెంటనే వికెట్లు పడగొట్టగలిగారన్నాడు. ధోని లేకుండా చెన్నై చేజింగ్  కు దిగడం తమకు కలిసొచ్చిందని రోహిత్ వెల్లడించాడు. 

ఇక ఈ మ్యాచ్ ఆరంభంలో తాము టాస్ ఓడిపోవడం కూడా మంచిదే అయ్యిందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. లేదంటే తాము టాస్ గెలిచినా ఫీల్డింగ్ ఎంచుకునేవారమని...అప్పుడు ఫలితం ఎలా వుండేదోనని అన్నాడు. అయితే మొదట బ్యాటింగ్ కు దిగినా, బౌలింగ్ చేయాల్సి వచ్చినా అత్యుత్తమ క్రికెట్ ఆడాలని తమ జట్టు ముందుగానే నిర్ణయించుకుందని తెలిపాడు. తమ ఆటగాళ్లు కూడా దానికి తగ్గట్లుగానే చాలాబాగా ఆడారని ప్రశంసించాడు. 

చెపాక్ పిచ్ పై పరుగులు సాధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని రోహిత్ పేర్కొన్నాడు. అయితే తాము సంయనంలో వికెట్లు కాపాడుకుంటూ పరుగులు సాధించడంతో సఫలమయ్యామని...చెన్నై అలా చేయలేకపోయిందంటూ రోహిత్ ముంబై విక్టరీపై స్పందించాడు.   

మరిన్ని వార్తలు

అవెంజర్స్‌లో ఇకనుంచి హిట్ మ్యాన్ కూడా: రోహిత్ పై పాండ్యా ఆసక్తికర ట్వీట్

కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్... అరుదైన రికార్డు బద్దలు

మలింగ మాయాజాలం...ముంబై చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన చెన్నై

click me!