
IND-U19 vs NZ-U19: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్ లను గెలిచిన భారత్ సూపర్ సిక్స్ లోకి ప్రవేశించింది. మంగళవారం న్యూజిలాండ్-భారత్ ల మధ్య సూపర్ సిక్సులో తొలి మ్యాచ్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ తో భారత్ అదరగొట్టడంతో 214 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. యంగ్ ప్లేయర్ ముషీర్ ఖాన్ సెంచరీతో కదం తొక్కడంతో 8 వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ 131 పరుగులు, ఆదర్శ్ సింగ్ 52 పరుగులు, ఉదయ్ సహారన్ 34 పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాసన్ క్లార్క్ 4 వికెట్లు తీసుకున్నాడు.
ఇక 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ను భారత బౌలర్లు దెబ్బకొట్టారు. బౌలర్ల విజృంభణతో కేవలం 28.1 ఓవర్లలో 81 పరుగులకే న్యూజిలాండ్ టీమ్ కుప్పకూలింది. దీంతో టీమిండియా 214 పరుగుల తేడాతో గెలిచింది. భారత బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లు, సౌమీ పాండే 2, ముషీర్ ఖాన్ 2, నమన్ తివారి, కుల్ కర్ణిలు చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరును కనబర్చిన ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నలిచాడు.
ముషీర్ ఖాన్ 109 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ లతో ముషీర్ ఖాన్ ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ ప్రపంచకప్‌లో రెండో సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్ కు ముందు రోజు ముషీర్ ఖాన్ సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ భారత సీనియర్ జట్టులో ఎంపికయ్యాడు. మరుసటి రోజే ముషీర్ ఖాన్ అండర్-19 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించి సంచలనంగా మారాడు.
గల్లీ క్రికెటర్ నుంచి స్టార్ ప్లేయర్ గా.. ఇప్పుడు డీఎస్పీగా దీప్తి శర్మ