కేఎల్ రాహుల్ కి ఐదుమిలియన్ల ఫాలోవర్స్.. అభిమానానికి థ్యాంక్స్ అంటూ ట్వీట్..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 16, 2020, 10:40 AM IST
కేఎల్ రాహుల్ కి ఐదుమిలియన్ల ఫాలోవర్స్.. అభిమానానికి థ్యాంక్స్ అంటూ ట్వీట్..

సారాంశం

మీ అభిమానానికి థ్యాంక్స్‌.. మీరిచ్చిన సపోర్ట్‌ నాకు ఎంతో ప్రత్యేకం. జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నా మీరిచ్చే సహకారంతో ఇంతదాకా చేరుకున్నా.. మీ ప్రేమ ఇకమీదట కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్‌ చేశాడు కేఎల్ రాహూల్. 

2014లో టీమిండియాకు ఎంపికైన కేఎల్‌ రాహుల్‌ తొందర్లోనే మంచి టైమింగ్‌ ఉన్న క్రికెటర్‌గా పేరు సంపాదించాడు. కెరీర్‌ ఆరంభం నుంచి సొగసైన షాట్లతో అలరిస్తూ టీమిండియా జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 

తాజాగా కేఎల్‌ రాహుల్‌ ట్విటర్‌ ఖాతా ఐదు మిలియన్ల ఫాలోవర్స్‌కు చేరుకుంది. దీనిమీద స్పందిస్తూ కేఎల్ రాహుల్‌ ఆనందం వ్యక్తం చేశాడు. మీ అందరి అభిమానం వల్లే ఇక్కడిదాకా వచ్చానంటూ కృతజ్ఞతలు తెలిపాడు. 

పంత్‌, వృద్దిమాన్‌ సాహా, దినేష్‌ కార్తిక్‌ వంటి ఆటగాళ్ల నుంచి పోటీని తట్టుకొని మరీ ఎంఎస్‌ ధోని తర్వాత అన్ని ఫార్మాట్లకు రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌గా స్థానం భర్తీచేసే పనిలో ఉన్నాడు. 

2014లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కేఎల్‌ రాహుల్‌ 35 వన్డేల్లో 4 సెంచరీల సాయంతో  1332 పరుగులు, 36 టెస్టుల్లో 5 సెంచరీల సాయంతో 2006 పరుగులు, 44 టీ20ల్లో 1542 పరుగులు సాధించాడు. టీ20లో రాహుల్‌ రెండు సెంచరీలు సాధించాడు. 

కాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ దుమ్మురేపే ప్రదర్శన నమోదు చేశాడు. కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించిన రాహుల్‌  ఒక సెంచరీ.. 5 అర్థ సెంచరీలతో మొత్తం 14 మ్యాచ్‌ల్లో 670 పరుగులు సాధించి లీగ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

PREV
click me!

Recommended Stories

టీమిండియాకు మాజీ కోచ్ ద్రావిడ్ గట్టి హెచ్చరిక.. ఇవి పాటించకపోతే టెస్ట్ క్రికెట్ గోవిందా
Abhishek Sharma : 2024 వరకు అనామకుడు.. 2026లో వరల్డ్ నంబర్ 1 టీ20 క్రికెటర్.. రెండేళ్లలో ఎలా సాధ్యమయ్యింది..?