రషీద్ ఖాన్ ‘డ్యాన్సింగ్’ క్యాచ్... బౌండరీ లైన్ దగ్గర తిప్పలు పడుతూ, కళ్లు చెదిరే క్యాచ్...

Published : Dec 15, 2020, 11:23 AM IST
రషీద్ ఖాన్ ‘డ్యాన్సింగ్’ క్యాచ్... బౌండరీ లైన్ దగ్గర తిప్పలు పడుతూ, కళ్లు చెదిరే క్యాచ్...

సారాంశం

బౌండరీ లైన్ దగ్గర కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న రషీద్ ఖాన్... బ్యాలెన్స్ కోల్పోకుండా తిప్పలు పడుతూ సిక్సర్‌ను క్యాచ్‌గా మలిచిన ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్...  

ఐపీఎల్ 2020 సీజన్‌ను పూర్తిచేసుకున్న ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్... ఇప్పుడు ఆసీస్ బీబీఎల్ 2020 లీగ్‌లో ఆడుతున్నాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో బాగానే రాణించిన రషీద్ ఖాన్, బిగ్‌బాష్ లీగ్‌లో తన ఫీల్డింగ్ విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

ఆడిలైడ్ స్టైకర్స్ తరుపున ఆడుతున్న రషీద్ ఖాన్... హోబార్డ్ హరీకేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు.16వ ఓవర్‌లో ఇన్‌గ్రామ్ ఓ భారీ షాట్ ఆడాడు. బంతి దాదాపు సిక్సర్ వెళ్లిందని ఫిక్స్ అయిన ఇన్‌గ్రామ్‌కి షాక్ ఇచ్చాడు రషీద్ ఖాన్.

బౌండరీ లౌన్ దగ్గర పైకి ఎగురుతూ బంతిని ఒడిసి పట్టుకున్న రషీద్ ఖాన్... బౌండరీలోకి పడిపోకుండా కాసేపు బ్యాలెన్స్ చేశాడు. కాళ్లను పైకి లేపుతూ ఓ విధంగా డ్యాన్స్ చేశాడు. ఇక బౌండరీలోకి పడిపోవడం ఖాయం అనుకున్న టైమ్‌లో బంతిని పైకి విసిరి, మళ్లీ క్యాచ్ అందుకున్నాడు..

 

PREV
click me!

Recommended Stories

IND vs ZIM: 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. జింబాబ్వేను చిత్తు చేసిన టీమిండియా
T20Iల్లో జింబాబ్వేపై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత బ్యాటర్లు వీరే.. నంబర్ వన్ ఎవరంటే?