స్టీవ్ స్మిత్‌కి గాయం... టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకి మరో షాక్ తగులుతుందా?

By team teluguFirst Published Dec 15, 2020, 5:34 PM IST
Highlights

ప్రాక్టీస్ సెషన్స్‌ మధ్యలో నుంచే వెళ్లిపోయిన సీనియర్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్... 

ఇప్పటికే గాయాలతో టెస్టు సిరీస్‌కి దూరమైన డేవిడ్ వార్నర్, అబ్బాట్, విల్ పుకోవిస్కీ...

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆతిథ్య ఆస్ట్రేలియాను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే గాయం కారణంగా ఓపెనర్ డేవిడ్ వార్నర్, విల్ పుకోవిస్కీ మొదటి టెస్టు మ్యాచ్‌కు దూరం అయ్యారు. వీరితో పాటు సీనియర్ బౌలర్ అబ్బాట్ కూడా మొదటి టెస్టులో బరిలో దిగడం లేదు.

తాజాగా ప్రాక్టీస్ సెషన్స్‌లో సీనియర్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్... వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు కనిపించింది. గురువారం ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్టు కోసం ఆడిలైడ్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు ఆసీస్ ప్లేయర్లు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్, టూర్ ప్రారంభానికి ముందే ఫామ్‌లోకి వచ్చానని చెప్పి మరీ మొదటి రెండు వన్డేల్లో సెంచరీలు బాదాడు.

రెండు వన్డేల్లోనూ 62 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్న స్మిత్, టెస్టుల్లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐసీసీ టెస్టు ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ కూడా దూరమైన ఆసీస్‌కి కష్టాలు తప్పకపోవచ్చు. అయితే స్మిత్ గాయం నుంచి కోలుకుని, మొదటి టెస్టులో బరిలో దిగుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా.

Steve Smith walks off rather gingerly on Tuesday evening pic.twitter.com/A09KWOm4Dw

— Bharat Sundaresan (@beastieboy07)

 

click me!