James Anderson : గత కొన్ని రోజులుగా టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాల మధ్య, ప్రపంచంలోని గొప్ప ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
James Anderson : అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌లను చెడుగుడు ఆడుకున్న ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది లార్డ్స్‌లో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడనున్నాడు. ప్రపంచంలోని గొప్ప టెస్ట్ బౌలర్లలో అండర్సన్ ఒకరు. టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ కు ఒంటిచెత్తో అనేక విజయాలు అందించాడు. 41 ఏళ్ల అండర్సన్ ఇప్పుడు తన 20 ఏళ్ల సుదీర్ఘ టెస్టు క్రికెట్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.
లార్డ్స్‌లో చివరి మ్యాచ్
అండర్సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ గురించి పంచుకున్నాడు. లార్డ్స్‌లోని చారిత్రాత్మక మైదానంలో అతను చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్-ఇంగ్లండ్‌ల మధ్య లార్డ్స్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జూలై 10 నుంచి 14 వరకు జరగనుంది. ఈ మ్యాచ్ తర్వాత తాను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటానని అండర్సన్ పేర్కొన్నాడు. అండర్సన్ లార్డ్స్ మైదానంలోనే టెస్టు క్రికెట్ అరంగేట్రం చేయడం విశేషం. టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచ బౌలర్లలో అండర్సన్ మూడో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 700+ వికెట్లు తీసుకున్నాడు.
ఇదే నా చివరి ఐపీఎల్.. రోహిత్ శర్మ సంచలన వీడియో
అందరికీ ధన్యవాదాలు..
తన 20 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు అండర్సన్ పేర్కొన్నాడు. కుటుంబం నుంచి అభిమానుల వరకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. "డానియేలా, లోలా, రూబీ, నా తల్లిదండ్రుల ప్రేమ, మద్దతు లేకుండా నేను ఈ ప్రయాణం చేసేవాడిని కాదు. వారికి చాలా ధన్యవాదాలు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా ఎదగడంలో తనతో వచ్చిన ఆటగాళ్లు, కోచ్‌లకు కూడా ధన్యవాదాలు. నేను ముందున్న కొత్త సవాళ్ల కోసం, అలాగే నా చివరి మ్యాచ్ లలో మెరుగైన ప్రదర్శన చేయడం కోసం ఉత్సాహంగా ఉన్నాను. ఇన్నేళ్లుగా నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. లార్డ్స్‌లో కలుద్దాం" అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు.
ప్రపంచంలోని గొప్ప ఫాస్ట్ బౌలర్..
టెస్టు క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన ప్రపంచంలోని ఏకైక పేసర్ జేమ్స్ అండర్సన్. 187 మ్యాచ్‌లు ఆడిన అండర్సన్ రెడ్ బాల్ క్రికెట్‌లో 700 వికెట్లు తీశాడు. ఇక వన్డే క్రికెట్ లో 194 మ్యాచ్‌లు ఆడి, 269 వికెట్లు పడగొట్టాడు. అండర్సన్ టీ20 క్రికెట్‌లో 19 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. అండర్సన్ ప్రపంచంలోనే అత్యధిక టెస్టు వికెట్లు తీసిన మూడో బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక-800 వికెట్లు), షేన్ వార్న్ (ఆస్ట్రేలియా-708 వికెట్లు) మాత్రమే జేమ్స్ అండర్సన్ కంటే ముందున్నారు.
IRE VS PAK: టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ కు వార్నింగ్ బెల్స్.. పాక్ ను చిత్తుచేసిన ఐర్లాండ్