IRE vs PAK: టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ కు వార్నింగ్ బెల్స్.. పాక్ ను చిత్తుచేసిన ఐర్లాండ్

By Mahesh Rajamoni  |  First Published May 11, 2024, 10:31 PM IST

Ireland vs Pakistan : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో భార‌త్ త‌న తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో త‌ల‌ప‌డ‌నుంది. అయితే, పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన ఐర్లాండ్.. భార‌త్ కు వార్నింగ్ బెల్స్ మోగించింది. 
 


Ireland vs Pakistan : ఐర్లాండ్‌ పర్యటనలో ఉన్న పాకిస్థాన్‌ మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్‌ ఆడుతోంది. జూన్‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఈ టోర్నీని ఇరు దేశాలు వార్మప్ సిరీస్ గా చూస్తున్నాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ లో అనేక రికార్డుల‌తో స్టార్ ప్లేయ‌ర్లు ఉన్న పాకిస్థాన్ ను ప‌సికూనగా చెప్పుకునే ఐర్లాండ్ ఓడించింది. ఈ మ్యాచ్ గెలుపుతో వ‌ర‌ల్డ్ క‌ప్ కు ముందు భార‌త్ తో పాటు ఇత‌ర జ‌ట్ల‌కు హెచ్చ‌రిక‌లు పంపింది.

ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే పటిష్టమైన పాకిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ లో భారీ స్కోర్ సాధించింది. పాకిస్థాన్ జట్టులో బాబర్ ఆజం కెప్టెన్ గా ఉన్నాడు. బాబార్ ఆజంతో పాటు మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్, షతాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాహీన్ అఫ్రిదీలు చోటు దక్కించుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ బాబర్ అజామ్ అత్యధికంగా 57 పరుగులు చేశాడు.

Latest Videos

ఇదే నా చివ‌రి ఐపీఎల్.. రోహిత్ శ‌ర్మ సంచ‌ల‌న వీడియో

కెప్టెన్ తో పాటు సయీమ్ అయూబ్ 45 పరుగులు, ఇఫ్తికార్ అహ్మద్ 37 పరుగులు చేశారు. బౌలింగ్ విషయానికొస్తే ఐర్లాండ్ క్రెయిగ్ యంగ్ 2 వికెట్లు తీశాడు. మార్క్ అడైర్, గారెత్ డెలానీ చెరో వికెట్ తీసుకున్నారు. 183 ప‌రుగుల భారీ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఐర్లాండ్ కు ఓపెన‌ర్లు మంచి శుభారంభం అందించార‌. ఓపెన‌ర్ ఆండ్రూ పాల్బిర్నీ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 77 పరుగుల త‌న ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాదాడు. హ్యారీ టెక్టర్ 36 పరుగులు, జార్జ్ డోగ్రెల్ 24 పరుగులు చేయడంతో ఐర్లాండ్ 19.5 ఓవర్లలో 183 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను ఓడించింది.

ఈ మ్యాచ్‌లో విజయంతో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ముందు ఐర్లాండ్ భారత జట్టుకు హెచ్చ‌రిక‌లు పంపింది. ఐపీఎల్ ముగిసిన వెంట‌నే 9వ టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి 29 వరకు యూఎస్ఏ, వెస్టిండీస్ వేదిక‌లుగా జరగనుంది. ఇందులో భారత్, శ్రీలంక, ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్, నేపాల్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఒమన్, అమెరికా, వెస్టిండీస్, కెనడా, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, న్యూజిలాండ్, నమీబియా, స్కాట్లాండ్, బంగ్లాదేశ్.. మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. 20 జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించారు. ప్ర‌పంచ క‌ప్ లో భారత్ తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. జూన్ 5న న్యూయార్క్ వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

కేఎల్ రాహుల్-ల‌క్నో య‌జ‌మానికి ప‌డ‌టం లేదా? గ్రౌండ్ లోనే ఎందుకింత ర‌చ్చ‌.. !

click me!