
Legendary Cricket Umpire Dickie Bird : లెజెండరీ ఇంగ్లీష్ అంపైర్ డిక్కీ బర్డ్ మంగళవారం 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన 1973 నుంచి 1996 వరకు 66 టెస్ట్ మ్యాచ్లు, 69 వన్డేలలో అంపైర్‌గా సేవలందించారు. మూడు వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆయన ఆఫీషియేట్ చేసినందుకు ప్రసిద్ధి చెందారు. యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ తమ ప్రకటనలో "క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి గల, ప్రజల ఇష్టమైన అంపైర్"గా పేర్కొంది.
డిక్కీ బర్డ్ 1933 ఏప్రిల్ 19న బార్న్స్‌లీలో జన్మించారు. యువకుడిగా ఆయన ఫుట్‌బాల్ ప్లేయర్ గా ఎదుగుతున్న క్రమంలో 15 ఏళ్ల వయసులో గాయం కారణంగా కెరీర్ ఆగిపోయింది. ఆ తర్వాత ఆయన క్రికెట్ పై ఆసక్తి పెంచుకున్నారు. బార్న్స్‌లీ క్రికెట్ క్లబ్‌లో చేరారు. అక్కడి నుంచే ఆయన ప్రయాణం మొదలైంది.
డిక్కీ బర్డ్ యార్క్‌షైర్ లీసెస్టర్‌షైర్ కౌంటీల్లో 93 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడారు, 3314 పరుగులు సాధించారు. అత్యధిక స్కోరు 181 నాట్ అవుట్. అవకాశాలు పెద్దగా రాకపోవడంతో 32 ఏళ్ల వయసులోనే క్రికెట్ కు వీడ్కోలు పలికారు. 1970లో కౌంటీ మ్యాచ్‌లో మొదటి సారి అంపైర్‌గా కెరీర్ ను మొదలు పెట్టారు. మూడు సంవత్సరాల తర్వాత 1973లో మొదటి టెస్ట్‌లో ఆఫీషియేట్ చేశారు.
ఆయన 1996లో చివరి టెస్ట్‌లో లార్డ్స్‌లో భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్‌లో అంపైర్‌గా ఉన్నారు. ఆ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలి, రాహుల్ ద్రవిడ్ టెస్ట్ డెబ్యూ చేశారు.
అంపైర్‌గా డిక్కీ బర్డ్ ప్రత్యేకతలు?
డిక్కీ బర్డ్ నిజాయితీ, హాస్యం, ప్రత్యేకమైన స్టైల్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఆయన మూడుసార్లు వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లలో ఆఫీషియేట్ చేశారు. 1986లో MBE, 2012లో OBE అవార్డులు పొందారు.
ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్, యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్, లీసెస్టర్‌షైర్ క్లబ్ ఆయన మరణంపై సంతాపం ప్రకటించాయి. మాజీ భారత క్రికెటర్ సునీల్ గవాస్కర్ “గొప్ప వ్యక్తిత్వం, ఆటగాళ్ల ఒత్తిళ్లను అర్థం చేసుకునేవారు” అంటూ నివాళులు అర్పించారు.
డిక్కీ బర్డ్ క్రికెట్ క్రీడా ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తుగా నిలిచారు. అంపైర్‌గా కాకుండా, అతని వ్యక్తిత్వం, హాస్యం, పాఠ్య రచనలు, టీవీ, పబ్లిక్ షో ద్వారా ఆయన అందరికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన జీవితం పూర్తిగా క్రీడాలకు అంకితం చేశారు. 92 ఏళ్ల వయసులో డిక్కీ బర్డ్ ప్రశాంతంగా ఆయన ఇంట్లో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.