KXIPvsRR: క్రిస్‌గేల్ ‘బాస్’ ఇన్నింగ్స్... భారీ స్కోరు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

Published : Oct 30, 2020, 09:15 PM ISTUpdated : Oct 30, 2020, 09:27 PM IST
KXIPvsRR: క్రిస్‌గేల్ ‘బాస్’ ఇన్నింగ్స్... భారీ స్కోరు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

సారాంశం

క్రిస్ గేల్ అద్భుత హాఫ్ సెంచరీ... 99 పరుగుల వద్ద అవుటై, సెంచరీ మిస్ చేసుకున్న ‘యూనివర్సల్ బాస్’... 46 పరుగులు చేసిన కెఎల్ రాహుల్... రెండో వికెట్‌కి 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన కెఎల్ రాహుల్, క్రిస్ గేల్...  

IPL 2020: టాస్ ఓడి, మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. మొదటి ఓవర్‌లోనే మన్‌దీప్ సింగ్ డకౌట్‌గా వెనుదిరిగినా... క్రిస్‌ గేల్‌తో కలిసి రెండో వికెట్‌కి 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్. 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్.

నికోలస్ పూరన్ 10 బంతుల్లో 3 సిక్సర్లతో 22 పరుగులు చేసి అవుట్ కాగా... ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ మరోసారి సునామీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 99 పరుగులు చేసిన క్రిస్ గేల్... ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బెన్‌స్టోక్స్ రెండు వికెట్లు తీయగా ఆర్చర్ రెండు వికెట్లు తీశాడు. 

PREV
click me!

Recommended Stories

Zanai Bhosle : ఆశా బోంస్లే మనవరాలితో సిరాజ్‌ రిలేషన్ ఏంటి..? ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ
Womens Cricket: విజేత‌ల‌కు రూ. 82 కోట్ల బ‌హుమ‌తి.. క్రికెట్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు