అంపైర్‌తో తెలుగులో మాట్లాడిన దినేశ్ కార్తీక్... అంపైర్ కూడా తెలుగోడే...

By team teluguFirst Published Oct 30, 2020, 3:12 PM IST
Highlights

 చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌తో తెలుగులో మాట్లాడిన కేకేఆర్ ప్లేయర్ షంషూద్దీన్...

సోషల్ మీడియాలో వీడియో వైరల్...

IPL 2020 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్ రేసులో నిలిచింది. కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడినా, ఐదోస్థానంలో ఉన్న కేకేఆర్ చివరి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్ పోరులో నిలుస్తుంది. సీజన్ మధ్యలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కేకేఆర్‌కి ఆ తర్వాత జరిగిన ఆరు మ్యాచుల్లో 2 విజయాలు మాత్రమ దక్కాయి.

వరుణ్ చక్రవర్తితో తమిళ్‌లో మాట్లాడుతూ సూచనలిచ్చే వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్...  నిన్న జరిగిన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌తో తెలుగులో మాట్లాడి  అందర్నీఆశ్చర్యానికి గురి చేశాడు. సామ్ కుర్రాన్ వేసిన బంతి బ్యాటుకి దూరంగా వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్ షంషూద్దీన్‌ను... ‘ఇది వైడా...’ అని అడిగాడు దినేశ్ కార్తీక్. దీనికి అంపైర్ షంషూద్దీన్ కూడా తెలుగులోనే సమాధానం చెప్పాడు.

‘లోపల.. చాలా లోపం... కొంచెం గూడ కాదు’ అని తెలుగులో అంపైర్ చెప్పింది అర్థం కాక బౌలర్ బుర్రగోక్కుంటూ పోయాడు. దినేశ్ కార్తీక్ చెన్నైలో సెటిలైన తెలుగు కుటుంబానికి చెందిన వాడు. అంపైర్ షంషుద్దీన్ కూడా తెలుగువాడే. హైదరాబాదీ అయిన షంషుద్దీన్ అంతర్జాతీయ మ్యాచుల్లో 43 వన్డేలకు, 20 టీ20లకు అంపైరింగ్ చేశాడు.

 

Umpire gadu manode 🙃 pic.twitter.com/qx3mBaxtDW

— Bran (@BRAND0N_KlNG)

 

 


 

click me!