కోహ్లీ, రోహిత్ టెస్ట్ రిటైర్మెంట్ పై అజిత్ అగార్కర్ ఏమన్నారంటే?

Published : May 24, 2025, 10:20 PM IST
Kohli Rohit Test Retirement Agarkar Comments

సారాంశం

Kohli Rohit Test Retirement Agarkar Comments: టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Kohli Rohit Test Retirement Agarkar Comments: భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ దిగ్గజ ప్లేయర్ల రిటైర్మెంట్ పై తాజాగా బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించారు. 

ఇంగ్లాండ్ తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం 16 మంది సభ్యుల భారత జట్టును అగార్కర్ ప్రకటించారు. రోహిత్ శర్మ స్థానంలో శుభ్ మన్ గిల్ కొత్త టెస్ట్ కెప్టెన్ గా నియమితులయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్ట్ క్రికెట్ లో కొత్త శకం మొదలవుతున్న నేపథ్యంలో ఈ జట్టు ప్రకటనపై చాలా ఉత్కంఠ నెలకొంది.

ఇంగ్లాండ్ టూర్ కి ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా గాబా టెస్ట్ తర్వాత అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ పై అగార్కర్ కామెంట్స్

ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో అజిత్ అగార్కర్ మాట్లాడుతూ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తో వాళ్ళ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని అన్నారు. ఏప్రిల్ లోనే కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని తనకు చెప్పారని తెలిపారు.

“ఇలాంటి స్టార్ ప్లేయర్లు రిటైర్ అయినప్పుడు వాళ్ళ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. కొన్ని నెలల క్రితం అశ్విన్ కూడా రిటైర్ అయ్యాడు. ఈ ముగ్గురూ మన క్రికెట్ దిగ్గజాలు. వాళ్ళతో నేను మాట్లాడాను” అని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చెప్పాడు. 

“ఏప్రిల్ లో కోహ్లీ నాకు ఫోన్ చేసి రిటైర్ అవుతున్నట్లు చెప్పాడు... బహుశా అతనికి ఇదే సరైన సమయం అనుకుంటాను. అతను చెప్పినప్పుడు మనం గౌరవించాలి. వాళ్ళిద్దరూ ఆ గౌరవాన్ని సంపాదించుకున్నారు. అతన్ని మనం ఖచ్చితంగా మిస్ అవుతాము. 123 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 30 సెంచరీలు చేసిన స్టార్ అతను” అని అగార్కర్ అన్నారు.

టీమిండియా తరపున టెస్ట్ లలో నాలుగో అత్యధిక పరుగుల స్కోరర్ గా విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాడు. 123 మ్యాచ్ లలో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలతో 9230 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 67 మ్యాచ్ లలో 12 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలతో 4301 పరుగులు చేశాడు.

టెస్ట్ కెప్టెన్ గా బుమ్రాను ఎందుకు ఎంచుకోలేదు? 

టెస్ట్ క్రికెట్ లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి జస్ప్రీత్ బుమ్రా కూడా పోటీదారుల్లో ఉన్నాడు, కానీ సెలెక్టర్లు రోహిత్ శర్మ స్థానంలో శుభ్ మన్ గిల్ ను ఎంచుకున్నారు. బుమ్రాను టెస్ట్ కెప్టెన్ గా ఎందుకు ఎంచుకోలేదనే విషయాన్ని అగార్కర్ చెప్పాడు. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. 

“ఆస్ట్రేలియాలో బుమ్రా వైస్ కెప్టెన్ గా ఉన్నాడు, కానీ అతను అన్ని ఐదు టెస్ట్ లకు అందుబాటులో లేడు కాబట్టి, అతను ఫిట్ గా ఉండాలని మేము కోరుకున్నాము” అని అగార్కర్ తెలిపాడు. “బుమ్రాపై అదనపు భారం వేయడం కంటే బౌలింగ్ చేయడం మంచిది. మేము అతనితో మాట్లాడాము, అతను దానికి సరే అన్నాడు. ఇది అతని వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ కు సంబంధించినది” అని అగార్కర్ అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !