కెఎల్ రాహుల్ సెంచరీ, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ... ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు...

Published : Jul 20, 2021, 10:15 PM IST
కెఎల్ రాహుల్ సెంచరీ, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ... ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు...

సారాంశం

కౌంటీ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ సెంచరీ... 75 పరుగులు చేసిన రవీంద్ర జడేజా... 

కౌంటీ ఎలెవన్ జట్టుతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయినా, కెఎల్ రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా గైర్హజరీతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా చోటు దక్కించుకున్న కెఎల్ రాహుల్, 150 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 101 పరుగులు చేసి రిటైర్ అయ్యాడు.

రవీంద్ర జడేజా 146 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 75 పరుగులు చేసి అవుట్ కాగా శార్దూల్ ఠాకూర్ 28 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ డకౌట్ అయ్యాడు. 

భారత జట్టు తరుపున రోహిత్ శర్మ 9, మయాంక్ అగర్వాల్ 28, ఛతేశ్వర్ పూజారా 21, హనుమ విహారి 24 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

కెఎల్ రాహుల్ చివరిసారిగా 2019లో టెస్టు మ్యాచ్ ఆడగా, దాదాపు 16 నెలల కిందట ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఆసీస్ టూర్‌లో, ఇంగ్లాండ్ సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన కెఎల్ రాహుల్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !