బ్యాట్స్‌మెన్ కింద పడిపోయాడని... క్రీడాస్ఫూర్తి చాటుకున్న జో రూట్...

By Chinthakindhi RamuFirst Published Jul 18, 2021, 4:40 PM IST
Highlights

పరుగు తీస్తూ పడిపోయిన బ్యాట్స్‌మెన్... రనౌట్ చేయకుండా క్రీడాస్ఫూర్తిని చాటుకున్న యార్క్ షైర్...

లాంక్యాషైర్, యార్క్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సంఘటన..

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్, క్రీడా స్ఫూర్తితో క్రికెట్ ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నాడు. ఈ సంఘటన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో జరిగింది. పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక కాని టెస్టు కెప్టెన్ జో రూట్, ప్రస్తుతం కౌంటీ ఛాంపియన్‌షిన్‌లో పాల్గొంటున్నాడు.

యార్క్‌షైర్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జో రూట్, లాంక్యాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ రనౌట్‌కి అవకాశం వచ్చినా, మానవతా దృక్పథంతో వ్యవహారించాడు. అసలు ఇంతకీ ఏమైందంటే...

లాంక్యాషైర్, యార్క్‌షైర్ మధ్య జరిగిన టీ20 బ్లాస్ట్ మ్యాచ్‌లో 18వ ఓవర్‌లో మాథ్యూ వేడ్ బౌలింగ్‌లో ఓ షాట్ ఆడిన లూక్స్ వెల్స్, సింగిల్ తీసేందుకు ప్రయత్నించి కింద పడిపోయాడు. బంతిని అందుకున్న ఫీల్డర్లు, రనౌట్ చేసేందుకు ప్రయత్నించగా, నాన్‌స్ట్రైయికింగ్‌లో ఉన్న క్రాఫ్ట్ కిండపడిపోయాడు.

What would you have done?

Croft goes down injured mid run and decide not to run him out pic.twitter.com/v1JHVGLn1T

— Vitality Blast (@VitalityBlast)

వెంటనే జో రూట్, ఫీల్డర్లను వారించి, రనౌట్ చేయకుండా ఆపేశాడు. అప్పటికి లాంక్యాషైర్ జట్టు విజయానికి 18 బంతుల్లో 15 పరుగులు కావాల్సిన దశలో ఉండడం విశేషం. ఆ వికెట్ తీసి ఉంటే, యార్క్‌షైర్‌కి కాస్త ఛాన్స్ ఉండేది. అయితే జో రూట్ ఆ ఛాయిస్ ఎంచుకోలేదు.

6 బంతులు ఉండగానే లాంక్యాషైర్ విజయాన్ని అందుకోగా, క్రీడాస్ఫూర్తితో వ్యవహారించిన యార్క్ షైర్, క్రికెట్ ఫ్యాన్స్‌ మనసులను గెలుచుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

click me!