ఆసిఫ్ బౌలింగ్‌కి భయపడి, డివిల్లియర్స్ ఏడ్చేసేవాడు... షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్...

Published : Jan 04, 2021, 02:11 PM IST
ఆసిఫ్ బౌలింగ్‌కి భయపడి, డివిల్లియర్స్ ఏడ్చేసేవాడు... షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్...

సారాంశం

మహ్మద్ ఆసిఫ్ బౌలింగ్ ఎదుర్కోలేక ఏబీ డివిల్లియర్స్ ఏడ్చేసినంత పని చేసేవాడు... భారత స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్‌ కూడా ఆసిఫ్ బౌలింగ్‌లో ఎలా ఆడాలో అర్థమయ్యేది కాదు...  సంచలనవ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్...

ఈ శతాబ్దంలోని బెస్ట్ క్రికెటర్లలో ఒకడిగా పేరొందాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా, ఐపీఎల్ వంటి లీగుల్లో పరుగుల వరద పారిస్తూ ‘మిస్టర్ 360’గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఏబీడీ.

అయితే ఏబీ డివిల్లియర్స్, పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆసిఫ్ బౌలింగ్ ఎదుర్కోవడానికి భయపడి, ఏడ్చేసేవాడని షాకింగ్ కామెంట్లు చేశాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. 
‘పాక్‌తో సిరీస్ ఆడేటప్పుడు మహ్మద్ ఆసిఫ్ బౌలింగ్ ఎదుర్కోలేక ఏబీ డివిల్లియర్స్ ఏడ్చేసినంత పని చేసేవాడు.

భారత స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్‌ కూడా ఆసిఫ్ బౌలింగ్‌లో ఎలా ఆడాలో అర్థమయ్యేది కాదు... ఓసారి నాతో ఈ కుర్రాడి బౌలింగ్‌లో ఎలా ఆడాలి? ఏబీడీ కూడా ఇతని బౌలింగ్‌లో ఆడలేక ఏడుస్తున్నాడు... అని వీవీఎస్‌ లక్ష్మణ్‌, నాతో ఆసియా టెస్ట్ ఛాంపియన్‌షిప్ సమయంలో చెప్పాడ’ని కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్. 

అసిఫ్ తర్వాత బుమ్రా స్మార్ట్ ఫాస్ట్ బౌలర్ అని చెప్పిన అక్తర్.. టెస్టు క్రికెట్‌లో కూడా ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేయగలరని కితాబిచ్చాడు. పిచ్‌తో సంబంధం లేకుండా అద్భుతంగా బౌలింగ్ చేయగల మొట్టమొదటి భారత బౌలర్ బుమ్రా అన్నాడు షోయబ్ అక్తర్. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు