కోలుకుంటున్న సౌరవ్ గంగూలీ... మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి ఇంటికి...

Published : Jan 04, 2021, 05:04 PM IST
కోలుకుంటున్న సౌరవ్ గంగూలీ... మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి ఇంటికి...

సారాంశం

సౌరవ్ గంగూలీకి గుండె ఆపరేషన్... మూసుకుపోయిన రెండు ధమనులను తొలగించి, స్టంట్ వేసిన వైద్యులు... బుధవారం ఆసుపత్రి నుంచి డిశార్చి చేస్తున్నట్టు వెల్లడి... 

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం కోలుకుంటోంది. శనివారం ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీకి వైద్యులు సర్జరీ నిర్వహించారు.

గంగూలీ గుండెలో మూసుకుపోయిన రెండు నాళాలను తొలగించిన వైద్యులు, స్టెంట్ వేశారు. కోల్‌కత్తాలోని ఉడ్‌లాండ్స్ ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పిన ఉడ్‌లాండ్స్ ఆసుపత్రి వైద్యులు.. ఆయన నిన్న రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారని తెలిపారు.

బుధవారం సౌరవ్ గంగూలీని ఆసుపత్రి నుంచి డిశార్జి చేస్తున్నట్టు తెలిపారు. డిశార్జి తర్వాత కొన్నాళ్లు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ, కొన్ని అవసరమైన శారీరక వ్యాయామాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు వైద్యులు.

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు