ఇప్పటికే తొలి టెస్టులో ఓటమిపాలైన భారత జట్టు నుండి ఇద్దరు దూరమయ్యారు. కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయాలతో రెండో టెస్టులో ఆడబోరని బీసీసీఐ ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఇంగ్లాండ్ జట్టుతో జరిగే రెండో టెస్ట్ కు భారత క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ బ్యాటర్ కెఎల్. రాహుల్, స్పిన్నర్ రవీంద్ర జడేజాలు దూరమయ్యారు. ఈ మేరకు సోమవారం నాడు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది.
ఫిబ్రవరి రెండో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో రెండో టెస్ట్ జరగనుంది.హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ నాలుగో రోజు మ్యాచ్ లో స్పిన్నర్ రవీంద్ర జడేజాకు గాయమైంది. కెఎల్ రాహుల్ కూడ భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితిపై వైద్య బృందం బీసీసీఐ ప్రకటించింది.
also read:భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్: హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ ట్రాక్ రికార్డు ఇదీ..
వీరిద్దరి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను భారత జట్టులో చేరారు.ఫిబ్రవరి 1, 2024 నుంచి అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే మూడో చివరి మల్టీ-డే గేమ్ కోసం ఇండియా ఏ జట్టులో వాషింగ్టన్ సుందర్ స్థానంలో సరన్ష్ జైన్ ఎంపికయ్యాడు.అవేష్ ఖాన్ అవసరమైతే టెస్టు జట్టులో చేరతాడని బీసీసీఐ తెలిపింది.
also read:IND vs ENG 1st Test: ఉప్పల్ స్టేడియంలో రోహిత్ శర్మ పాదాలను తాకిన అభిమాని, వీడియో వైరల్
హైద్రాబాద్ లో జరిగిన తొలి టెస్ట్ లో 28 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. ఐదు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో 0 -1 తో భారత జట్టు వెనుకబడింది.అహ్మాదాబాద్ లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ లయన్స్ పై ఇండియా ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ విజయంలో సర్ఫరాజ్ కీలక పాత్ర పోషించాడు.సర్ఫరాజ్ 161 పరుగులు చేశాడు. సుందర్ ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీశాడు. అంతేకాదు బ్యాటింగ్ లో కూడ తన సత్తా చాటాడు. హాఫ్ సెంచరీ చేశాడు.
రెండో టెస్టుకు భారత జట్టు
రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్, శ్రేయాస్ అయ్యర్, కెఎస్. భరత్, ధృవ్ జురేల్, రవిచంద్రన్ ఆశ్విన్, అక్షర్ పటేల్, కుల్ దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, అవేష్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్