అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియా కుర్రాళ్లు మరోసారి ఇరగదీయడమే కాదు హ్యాట్రిక్ విజయం సాధించారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 201 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియా కుర్రాళ్లు మరోసారి ఇరగదీయడమే కాదు హ్యాట్రిక్ విజయం సాధించారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 201 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అర్షిన్ కులకర్ణి (108) , ముషీర్ ఖాన్ (73)లు జట్టు భారీ స్కోరు సాధించేందుకు తోడ్పాటును అందించారు. ఆదర్శ్ సింగ్ (25), ఉదయ్ సహరన్ (35), ప్రియాన్షు మోలియా (27), సచిన్ దాస్ (20) పరుగులు చేశారు. అమెరికా బౌలర్లలో అతీంద్ర సుబ్రహ్మణియన్ 2, ఆర్య గార్గ్, ఆరిన్ నద్కరిణి , రిషి రమేశ్‌లు తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన యూఎస్ఏ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉత్కర్ష్ శ్రీవాస్తవ (40), ఆమోఘ్ ఆరేపల్లి (27), ఆరిన్ నద్కరిణి (20)లు పోరాడటంతో యూఎస్ ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. భారత బౌలర్లలో నమన్ తివారీ (4) వికెట్లు తీసి అమెరికా వెన్నువిరిచాడు. రాజ్ లంబాని, సౌమీ పాండే , మురుగన్ అభిషేక్, ప్రియాన్షు మోలియాలు తలో వికెట్ పడగొట్టారు.