
భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ దయా హృదయాన్ని చాటుకున్నాడు. 11 ఏళ్ల వరాద్ అనే బాలుడి చికిత్స కోసం రూ.31 లక్షలు విరాళం ఇచ్చి, ఆదుకున్నాడు. అత్యంత అరుదైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 11 ఏళ్ల చిన్నారికి అత్యవసరంగా ఎముక మజ్జ మార్పిడి (Bone Marrow Trasplant (BMT)) శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు వైద్యులు...
అయితే ఆపరేషన్‌కి అయ్యే ఖర్చులను భరించేందుకు ఆ పిల్లాడి తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత సహకరించపోవడంతో దాతల సాయాన్ని కోరారు. తన టీమ్ ద్వారా పిల్లాడి పరిస్థితి తెలుసుకున్న క్రికెటర్ కెఎల్ రాహుల్, ఆపరేషన్ ఖర్చుల కోసం రూ.31 లక్షలను తక్షణ సాయంగా పంపించాడు...
‘గివ్ ఇండియా సంస్థ ద్వారా నాకు వరాద్ హెల్త్ కండిషన్ తెలిసిన వెంటనే, నా వల్ల అయిన సాయం చేయాలని నిర్ణయించుకున్నా. ఆపరేషన్ సక్సెస్ కావడం, వరాద్ కోలుకుంటుండడం నాకు సంతోషాన్ని కలిగించింది...’ అంటూ చెప్పుకొచ్చాడు క్రికెటర్ కెఎల్ రాహుల్...
‘వరాద్ సర్జరీ కోసం భారీగా నగదు సాయం చేసిన కెఎల్ రాహుల్‌కి రుణపడి ఉన్నాం... కెఎల్ రాహుల్ ముందుకు రాకపోతే ఇంత తక్కువ సమయంలో వరాద్‌కి ఎముక మజ్జ మార్పిడి శస్త్ర చికిత్స జరిగేది కాదు... థ్యాంకూ రాహుల్...’ అంటూ భారత క్రికెటర్‌కి ధన్యవాదాలు తెలిపింది పిల్లాడి తల్లి...
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెఎల్ రాహుల్, మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌కి కూడా అందుబాటులో ఉండడం లేదు రాహుల్...
ఈ గ్యాప్‌లో తన గర్ల్ ఫ్రెండ్ అథియా శెట్టితో కలిసి గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు కెఎల్ రాహుల్. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయిన అథియా శెట్టితో కెఎల్ రాహుల్ త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నాడని సమాచారం... అయితే ఇప్పటిదాకా ఈ విషయం గురించి ఎలాంటి ప్రకటనా రాలేదు.
సౌతాఫ్రికా టూర్‌లో టెస్టులకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ గైర్హజరీలో జోహన్‌బర్గ్ టెస్టుకి సారథిగా వ్యవహరించాడు. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌కి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు కెఎల్ రాహుల్...
అయితే టెస్టుతో పాటు వన్డే సిరీస్‌లోనూ చిత్తుగా ఓడింది లోకేశ్ రాహుల్ కెప్టెన్సీలోని భారత జట్టు. గత 60 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో మూడు నాలుగు మ్యాచుల్లో పరాజయాలు రుచి చూసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు క్రియేట్ చేశాడు కెఎల్ రాహుల్... అయితే బీసీసీఐ మాత్రం కెఎల్ రాహుల్‌లో కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయనే నమ్ముతున్నట్టు కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
ఓపెనర్‌గా కెఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్‌లను ఎంపిక చేశారు సెలక్టర్లు. వీరితో పాటు వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కి తిరిగి అవకాశం దక్కింది. గత ఏడాది జూన్‌లో శ్రీలంక టూర్‌లో కనిపించిన సంజూ శాంసన్, మళ్లీ లంకతో సిరీస్ ద్వారానే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.