రాహుల్ చెప్పిన మాటతోనే...: కివీస్ పై సూపర్ విన్ మీద కోహ్లీ స్పందన ఇదీ..

By telugu team  |  First Published Feb 1, 2020, 7:32 AM IST

న్యూజిలాండ్ నాలుగో టీ20ని సూపర్ ఓవరు ద్వారా గెలుచుకోవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు సూపర్ ఓవర్లు ఆడి విజయం సాధించడం ద్వారా తాను కొత్త పాఠాన్ని నేర్చుకున్నట్లు కోహ్లీ చెప్పాడు.


వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పై జరిగిన నాలుగో టీ20లో సూపర్ ఓవరులో విజయం సాధించడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. సూపర్ ఓవరులో తాను దిగకుండా సంజూ శాంసన్ ను పంపాలని తాను అనుకున్నానని, అయితే రాహుల్ చెప్పిన ఒక విషయంతో మనసు మార్చుకున్నానని ఆయన చెప్పాడు. అనుభవం కలిగిన తానే బ్యాటింగ్ కు రావాలని, తద్వారా అవకాశాలు మెరుగవుతాయని రాహుల్ చెప్పాడని ఆయన అన్నాడు.

సూపర్ ఓవరులో రాహుల్ తొలి రెండు బంతుల ద్వారా ఒక సిక్స్, ఓ ఫోర్ చేయడం ద్వారా సాధించిన పరుగులు విలువైనవని ఆయన అన్నాడు. తర్వాత తాను ఆరు పరుగులు తీసి జట్టును గెలిపించానని చెప్పాడు. యువ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ ను కోహ్లీ ప్రశంసించాడు. టాప్ ఆర్డర్ లో సంజూ శాంసను బెరుకు లేకుండా ధైర్యంగా ఆడుతాడని అన్నారు.

Latest Videos

undefined

Also Read: ఫోర్త్ టీ20: సూపర్ ఓవర్లో మరో సూపర్ విక్టరీ... కివీస్ పై కోహ్లీసేనదే పైచేయి

ఈ మ్యాచులో పిచ్ ను అంచనా వేయలేకపోయామని, సైనీ మంచి ప్రదర్శన చేశాడని ఆయన అన్నారు. ఈ విజయంతో తమ జట్టు ఆనందంగా ఉందని అన్నాడు. చివరి బంతి వరకు పోరాటం చేయడం వల్లనే విజయం సాధించామని కోహ్లీ అన్నాడు. ఈ రెండు మ్యాచుల ద్వారా తాను కొత్త విషయాన్ని తెలుసుకున్నానని, ప్రత్యర్థి జట్టు బాగా ఆడుతుంటే చివరి వరక ప్రశాంతంగా ఉండడంతో పాటు తిరిగి పుంజుకోవాలని, అప్పుడే విజయం సాధిస్తామని అర్థమైందని ఆయన అన్నాడు. 

Also Read: కోహ్లీ మెరుపు ఫీల్డింగ్: టీమిండియా గెలుపు అప్పుడే ఖాయం

ఇంతకన్నా ఉత్కంఠభరితమైన మ్యాచులు జరగాలని తాము ఆశించలేదని, గతంలో తాము ఎప్పుడూ సూపర్ ఓవర్లు ఆడలేదని, కానీ ఇప్పుడు వరుసగా రెండు మ్యాచులు ఆడి విజయం సాధించామని చెప్పాడు.న్యూజిలాండ్ పై జరిగిన నాలుగో టీ20ని సూపర్ ఓవరు ద్వారా ఇండియా గెలుచుకున్న విషయం తెలిసిందే.

click me!