KKR vs SRH: కోల్‌కత్తా ఘన విజయం... సన్‌రైజర్స్ ఖాతాలో రెండో ఓటమి...

Published : Sep 26, 2020, 11:04 PM ISTUpdated : Sep 26, 2020, 11:10 PM IST
KKR vs SRH: కోల్‌కత్తా ఘన విజయం... సన్‌రైజర్స్ ఖాతాలో రెండో ఓటమి...

సారాంశం

53 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా, గిల్ మ్యాజిక్‌తో కోలుకున్న నైట్‌రైడర్స్... దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్ డకౌట్... 70 పరుగులతో ఆకట్టుకున్న శుబ్‌మన్ గిల్... 42 పరుగులు చేసిన ఇయాన్ మోర్గాన్...  

IPL 2020 సీజన్ 13ను రెండు వరుస పరాజయాలతో మొదలెట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 143 పరుగుల స్వల్ప లక్ష్యచేధనలో ఏ మాత్రం తొందర పడకుండా స్లో అండ్ స్టడీగా పని కానిచ్చేశారు కోల్‌కత్తా నైట్‌రైడర్స్. సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్ డకౌట్ అయినా యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశాడు.

నితీశ్ రాణా 13 బంతుల్లో 6 ఫోర్లతో 26 పరుగులు చేసి అవుట్ కాగా... ఇయాన్ మోర్గాన్‌తో కలిసి చక్కని భాగస్వామ్యం నిర్మించిన శుబ్‌మన్ గిల్... సన్‌రైజర్స్ బౌలర్లకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. శుబ్‌మన్ గిల్ 62 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 70 పరుగులు చేయగా, మోర్గాన్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్, నటరాజన్ తలా ఓ వికెట్ తీశారు. 6.2 ఓవర్ల వద్ద దినేశ్ కార్తీన్‌ను అవుట్ చేసిన సన్‌రైజర్స్ బౌలర్లు, ఆ తర్వాత మరో వికెట్ తీయలేకపోయారు. టార్గెట్ చిన్నది కావడంలో రిస్క్ తీసుకోకుండా స్లో అండ్ స్టడీగా బ్యాటింగ్ చేసిన గిల్, మోర్గాన్ వార్ వన్‌ సైడ్ చేసారు. 

PREV
click me!

Recommended Stories

IND vs NZ : ఊచకోత అంటే ఇదేనేమో.. కివీస్ బౌలర్లను ఉతికారేసిన ఇషాన్, సూర్య !
Ishan Kishan : అమ్మబాబోయ్ ఏం కొట్టుడు.. రికార్డులన్నీ బద్దలు కొట్టిన ఇషాన్ కిషన్