KKR vs SRH: మనీశ్ పాండే హాఫ్ సెంచరీ... కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఈజీ టార్గెట్...

Published : Sep 26, 2020, 09:21 PM ISTUpdated : Sep 26, 2020, 09:28 PM IST
KKR vs SRH: మనీశ్ పాండే హాఫ్ సెంచరీ... కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఈజీ టార్గెట్...

సారాంశం

మనీశ్ పాండే హాఫ్ సెంచరీ... రాణించిన సాహా, డేవిడ్ వార్నర్...  

IPL 2020లో భాగంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి  142 పరుగులు చేసింది. బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ త్వరగా అవుటైనా వృద్దమాన్ సాహాతో కలిసి చక్కని భాగస్వామ్యం నిర్మించాడు మనీశ్ పాండే. బర్త్ డే బాయ్ బెయిర్ స్టో 5 పరుగులకే అవుట్ కాగా, కెప్టెన్ డేవిడ్ వార్నర్ 30 బంతుల్లో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

సాహాతో కలిసి మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మనీశ్ పాండే... 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో 30 పరుగులు చేసిన సాహా ఆఖరి ఓవర్‌లో రనౌట్ కాగా... నబీ 11, అభిషేక్ 2 పరుగులు చేయడంతో 142 పరుగులకి పరిమితమైంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

ప్యాట్ కమ్మిన్స్, ఆండ్రే రస్సెల్, వరుణ్ చక్రవర్తిలకి తలా ఓ వికెట్ దక్కింది. 
 

 

PREV
click me!

Recommended Stories

Abhigyan Kundu : వామ్మో ఏంటి కొట్టుడు.. IPL వేలానికి ముందు ఆసియా కప్‌లో డబుల్ సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్ !
IPL Mini Auction 2026: మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టే ప్లేయ‌ర్స్ వీళ్లే... ఏకంగా రూ. 30 కోట్ల పైమాటే..