KKR vs SRH : ఐపీఎల్ 2024 మూడో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్-కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ప్లేయర్ ఫిలిప్ సాల్ట్ వరుస సిక్సర్లతో మార్కో జన్సెన్ బౌలింగ్ ను చిత్తుచేశాడు.
KKR Philip Salt Back-to-back sixes: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ (ఐపీఎల్2024) లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ నుంచి ఫలిప్ సాల్ట్, సునీల్ నరైన్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఫిలిప్ సాల్ట్ మరోసారి ధనాధన్ బ్యాటింగ్ తో రెండో ఓవర్ లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆటను మొదలు పెట్టాడు.
ఈ మ్యాచ్ రెండో ఓవర్ లో వరుస సిక్సర్లు బాదాడు. సన్ రైజర్స్ బౌలర్ మార్కో జాన్సెన్ బౌలింగ్ ను ఊచకోత కోస్తూ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. ఒకే లైనప్ తో అద్భుతమైన టైమింగ్‌తో స్వీపర్ కవర్ మీదుగా సిక్సర్లు బాదాడు. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్ హోరెత్తింది. ఈ మ్యాచ్ లో ఫోర్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు. అనూహ్యంగా ఐపీఎల్ లోకి వచ్చిన సాల్ట్ అరంగేట్రంలోని 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
Kya aapke over mein Salt hai? 🧂 pic.twitter.com/B3KgK2HFld
— KolkataKnightRiders (@KKRiders)అయితే, అదే ఓవర్ లో సునీల్ నరైన్ ను రనౌట్ చేసి కేకేఆర్ కు షాకిచ్చింది హైదరాబాద్ టీమ్. ఆ తర్వాత రంగంలోకి దిగిన నటరాజన్ తన ఓవర్ లో రెండు వికెట్లు తీసుకుని కేకేఆర్ ను కష్టాల్లోకి నెట్టాడు. తన బౌలింగ్ లో కెప్టెన్ వెంకటేస్ అయ్యర్ ను పెవిలియన్ కు పంపాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్ అద్భుతమైన క్యాచ్ లో అయ్యర్ డకౌట్ గా వెనుదిరిగాడు.
3 six by Philip salt great 🔥🔥 pic.twitter.com/PuS6bZAiBN
— AMAAN SHAIKH (@theamannnn)PBKS vs DC : పృథ్వీ షాకు షాకిచ్చిన ఢిల్లీ.. షాయ్ హోప్ అరంగేట్రం.. నెటిజన్లు షాక్.. !