బెస్ట్ ఫినిషర్‌కు బిగ్గెస్ట్ ఆఫర్: దినేశ్ కార్తిక్ కు ఊతప్ప మద్దతు

By Arun Kumar PFirst Published Apr 16, 2019, 2:03 PM IST
Highlights

తీవ్ర పోటీని ఎదుర్కొని ప్రపంచ కప్ ఆడే భారత జట్టులో స్థానం సంపాదించిన దినేశ్ కార్తిక్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అనుభవం, ఆటతీరు రిత్యా జట్టులో అతడి అవసరాన్ని గుర్తించిన సెలెక్షన్ కమిటీ ప్రపంచ కప్ కు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ  విషయంలో సెలెక్షన్ కమిటీ నిర్ణయాన్ని ఇప్పటికే సీనియర్లు, అభిమానులు స్వాగతించగా తాజాగా ఐపిఎల్ లో సహచర ఆటగాడు రాబిన్ ఊతప్ప కూడా దినేశ్ కార్తిక్ ఎంపికకు మద్దతు ప్రకటించాడు. 

ప్రస్తుతం ఐపిఎల్ 2019లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గా కార్తిక్ వ్యవహరిస్తుండగా ఊతప్ప ఆ జట్టులో సభ్యుడు. దీంతో తమ కెప్టెన్ ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కించుకున్నాడని తెలిసిన వెంటనే ఊతప్ప స్పందించాడు. '' గొప్ప గేమ్ పినిషర్ కు మరింత గొప్ప అవకాశం వచ్చింది. గత రెండేళ్లుగా టీమిండియా తరపున వచ్చిన ప్రతి అవకాశాన్ని దినేశ్ కార్తిక్ సద్వినియోగం చేసుకున్నాడు. అందువల్లే అతడు ప్రపంచ కప్ జట్టులో స్ధానం సంపాదించాడు. అతడి ఉత్తమ ప్రతిభ, ప్రదర్శనకు దక్కిన గౌరవమే ప్రపంచ కప్ జట్టులో ఎంపిక'' అని ఊతప్ప కితాబిచ్చాడు. 

ప్రపంచ కప్ జట్టులో స్ధానం కోసం దినేశ్ కార్తిక్ కు యువ క్రికెటర్ రిషబ్ పంత్ కు మధ్య గట్టి పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. వీరిద్దరిలో రిషబ్ కే ప్రపంచ కప్ ఆడే అవకాశాలు ఎక్కువగా వుందంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ అనూహ్యంగా సోమవారం ప్రకటించిన ప్రపంచ కప్ జట్టు ఆటగాళ్ల లిస్ట్ లో పంత్ పేరు కాకుండా కార్తిక్ పేరు వుండటం అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. 

దీనిపై  టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ కూడా ఇచ్చారు. అనుభవాన్ని దృష్టిలో వుంచుకుని దినేశ్ కార్తిక్ కు ప్రపంచ కప్ ఆడే అవకాశమిచ్చినట్లు తెలిపారు. కేవలం ధోని జట్టుకు దూరమైనప్పుడు మాత్రమే కార్తిక్ సేవలను జట్టు వినియోగించుకోవాల్సి వుంటుంది కాబట్టి అలాంటి సమయంలో అనువజ్ఞులు వికెట్ కీపర్ గా వుంటే మంచిదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రిషబ్ పంత్,దినేశ్ కార్తిక్ ల మధ్య చివరి నిమిషం వరకు పోటీ నెలకొందని...చివరకు తాము అనుభవానికే పెద్ద పీట వేయాల్సి వచ్చినట్లు ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నారు.    
    
click me!