ప్రపంచ కప్ కు సన్నాహం: అసిస్ట్ చేసే ఫాస్ట్ బౌలర్లు వీరే...

Published : Apr 16, 2019, 01:41 PM IST
ప్రపంచ కప్ కు సన్నాహం: అసిస్ట్ చేసే ఫాస్ట్ బౌలర్లు వీరే...

సారాంశం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్ -2019)లో సైని, ఖలీల్, చాహర్ తమ సత్తాను చాటుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సాయం జట్టుకు అందించాలని బిసిసిఐ నిర్ణయించింది. 

ముంబై: ప్రపంచ కప్ పోటీలకు సిద్ధం కావడానికి జట్టుకు సాయం చేసే నలుగురు ఫాస్ట్ బౌలర్ల పేర్లను బిసిసిఐ ప్రకటించింది. నవదీప్ సైనీ, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్ ప్రపంచ కప్ పోటీలకు సిద్ధం కావడానికి జట్టుకు సాయం చేస్తారని బిసిసిఐ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్ -2019)లో సైని, ఖలీల్, చాహర్ తమ సత్తాను చాటుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సాయం జట్టుకు అందించాలని బిసిసిఐ నిర్ణయించింది. 

ప్రపంచ కప్ పోటీల్లో ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాలను జూన్ 6వ తేదీన ఎదుర్కోనుంది. ఆ తర్వాత జూన్ 13వ తేదీన న్యూజిలాండ్ తో తలపడుతుంది. దాయాదులైన పాకిస్తాన్ జట్టుతో జూన్ 16వ తేదీన తలపడుతుంది.

PREV
click me!

Recommended Stories

IND vs BAN : తగ్గేదే లే.. బంగ్లాదేశ్ కు ఇచ్చిపడేసిన భారత్.. గ్రౌండ్‌లో హీట్ పుట్టించిన కెప్టెన్లు !
Vaibhav Suryavanshi : ఊచకోత అంటే ఇదే.. బంగ్లా బౌలర్లని ఉతికారేసిన వైభవ్ ! కోహ్లీ రికార్డు పాయే