దక్కని చోటు: రిషబ్ పంత్ కు ఎమ్మెస్కే ప్రసాద్ ఓదార్పు

By telugu teamFirst Published Apr 16, 2019, 12:09 PM IST
Highlights

రిషబ్ పంత్ ను విశ్వాసంలోకి తీసుకుని జట్టులోకి తీసుకోకపోవడంపై వివరణ ఇచ్చి అతన్ని ఓదార్చే బాధ్యతను సెలెక్టర్లలో ఒక్కరు నిర్వహించనున్నారు. దాదాపుగా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆ బాధ్యతను తీసుకునే అవకాశం ఉంది. 

ముంబై: ఐసిసి ప్రపంచ కప్ పోటీలను ఎదుర్కునే జట్టులో రిషబ్ పంత్ కు చోటు దక్కని విషయం తెలిసిందే. అయితే, రిషబ్ పంత్ ను బిసిసిఐ అతని మానాన అతన్ని వదిలేయడానికి సిద్ధంగా లేదు. రిషబ్ పంత్ ను ఓదార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

రిషబ్ పంత్ ను విశ్వాసంలోకి తీసుకుని జట్టులోకి తీసుకోకపోవడంపై వివరణ ఇచ్చి అతన్ని ఓదార్చే బాధ్యతను సెలెక్టర్లలో ఒక్కరు నిర్వహించనున్నారు. దాదాపుగా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆ బాధ్యతను తీసుకునే అవకాశం ఉంది. 

గతంలో వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వహించిన ఎమ్మెస్కే ఎందుకు డ్రాప్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని రిషబ్ పంత్ కు అర్థమయ్యేలా వివరించగలరని భావిస్తున్నారు. ఏ పరిస్థితిలో రిషబ్ పంత్ ను కాకుండా దినేష్ కార్తిక్ ను జట్టులోకి తీసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని ఆయన వివరించే అవకాశం ఉంది. 

ఐసిసి ప్రపంచ కప్ జట్టులో చోటు కోసం రిషబ్ పంత్, అంబటి రాయుడుల పేర్లు పరిగణనలోకి వచ్చాయి. వారిని జట్టులోకి తీసుకోవాలా, వద్దా అనే విషయంపై విస్తృతంగానే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, చివరకు రిషబ్ పంత్ స్థానంలో దినేష్ కార్తిక్ కు, అంబటి రాయుడి స్థానంలో కెఎల్ రాహుల్ కు బిసిసిఐ సెలెక్టర్లు అవకాశం కల్పించారు. 

ప్రస్తతం రిషబ్ పంత్ ను ఓదార్చడాన్ని ప్రాముఖ్యమైన విషయంగా బిసిసిఐ భావిస్తోంది. పంత్ కు ప్రతిభ ఉందని, అతనికి చాలా సమయం కూడా ఉందని, జట్టులోకి పంత్ రాకపోవడం దృష్టకరమని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. 

click me!