ఆడుతూ పాడుతూ 10 ఓవర్లలో ఊదేసిన నైట్‌రైడర్స్... ఆర్‌సీబీకి మరో ఘోర ఓటమి...

Published : Sep 20, 2021, 10:26 PM IST
ఆడుతూ పాడుతూ 10 ఓవర్లలో ఊదేసిన నైట్‌రైడర్స్... ఆర్‌సీబీకి మరో ఘోర ఓటమి...

సారాంశం

తొలి వికెట్‌కి 82 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన శుబ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్... 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 

IPL 2021 సీజన్‌ను వరుసగా నాలుగు విజయాలతో ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో మూడో పరాజయాన్ని అందుకుంది. ఫేజ్‌2లో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

93 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 82 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు శుబ్‌మన్ గిల్...

34 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 పరుగులు చేసి శుబ్‌మన్ గిల్ అవుట్ కాగా, వెంకటేశ్ అయ్యర్ 27 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను 10 ఓవర్లలోనే ముగించాడు...  ఐపీఎల్ చరిత్రలోనే కేకేఆర్‌కి ఇదే అత్యంత వేగవంతమైన ఛేదన... ఇంతకుముందు 2011లో 13.5 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించారు కోల్‌కత్తా నైట్‌రైడర్స్..

ఈ విజయంతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఐదో స్థానానికి ఎగబాకింది. మూడో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ, రన్‌రేటు ఘోరంగా పడిపోయింది.  

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు