వికెట్ తీసిన ఆనందంలో విన్యాసాలు: వెన్నులో వణుకు పుట్టించింది.. వీడియో వైరల్

By Siva KodatiFirst Published Sep 4, 2020, 5:39 PM IST
Highlights

నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌ల్లో వికెట్ తీసినా, సెంచరీ చేసినా క్రికెటర్లు చేసే విన్యాసాలు అభిమానులను అలరిస్తూ ఉంటాయి. కొన్ని సార్లు వారి చేష్టలకు ఒళ్లు గగుర్పొడుస్తూ ఉంటుంది. 

నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌ల్లో వికెట్ తీసినా, సెంచరీ చేసినా క్రికెటర్లు చేసే విన్యాసాలు అభిమానులను అలరిస్తూ ఉంటాయి. కొన్ని సార్లు వారి చేష్టలకు ఒళ్లు గగుర్పొడుస్తూ ఉంటుంది.

కరేబియన్ క్రికెట్‌ లీగ్‌లో అచ్చం అలాంటి సంఘటనే జరిగింది. గురువారం గయానా వారియర్స్, బార్బడోస్ ట్రైడెంట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గయానా బౌలర్ కెవిన్ సింక్లెయిర్ కీలక ఆటగాడిని ఔట్ చేశానన్న ఆనందంతో దొమ్మరిగడ్డలు వేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

సాధారణంగా సోమర్‌సాల్ట్స్ (దొమ్మరిగడ్డలు) కాళ్లతో వేస్తుంటారు. కానీ సింక్లెయిర్ విభిన్నంగా ఒకసారి మాత్రమే  కాళ్లను ఉపయోగించగా, మిగిలిన రెండు సార్లు మాత్రం గాల్లోనే పల్టీలు కొట్టాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ అనంతరం దీనిపై స్పందించిన సింక్లెయిర్... లీగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న మిచెల్ శాంట్నర్‌ను ఔట్ చేశానన్న ఆనందంలోనే ఇలా చేసినట్లు వెల్లడించాడు.

కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ జట్టు  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన గయానా అమెజాన్ వారియర్స్ 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

ఈ విజయంతో లీగ్‌లో రెండో స్థానానికి చేరుకున్న గయానా వారియర్స్ సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసిన బార్బడోస్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచి సీపీఎల్ నుంచి నిష్క్రమించింది. 

click me!