ఐపీఎల్ 2020: మళ్లీ గ్రౌండ్‌లోకి దిగిన చెన్నై జట్టు, ఐసోలేషన్‌లోనే ఆ ఇద్దరు

By Siva KodatiFirst Published Sep 4, 2020, 3:12 PM IST
Highlights

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 13లో చెన్నై జట్టు కోవిడ్ బారినపడటం ఓ కుదుపు కుదిపింది. ఆటగాళ్లు సహా, సహాయక సిబ్బందికి పాజిటివ్ అని తేలడంతో ఐపీఎల్ జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 13లో చెన్నై జట్టు కోవిడ్ బారినపడటం ఓ కుదుపు కుదిపింది. ఆటగాళ్లు సహా, సహాయక సిబ్బందికి పాజిటివ్ అని తేలడంతో ఐపీఎల్ జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ సమయంలో చెన్నై జట్టు సీఈవో విశ్వనాథన్ అభిమానులకు తీపికబురు చెప్పారు. శుక్రవారం నుంచి సీఎస్కే మైదానంలో ప్రాక్టీస్ చేస్తుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్ మినహా ఆటగాళ్లందరికీ నెగిటివ్ వచ్చింనది విశ్వనాథన్ చెప్పారు. దీంతో ఈ ఇద్దరు మినహా మిగిలిన వాళ్లంతా ప్రాక్టీస్ చేస్తారని ఆయన వెల్లడించారు.

దీపక్, రుతురాజ్‌లకు 14 రోజుల క్వారంటైన్ అనంతరం మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని విశ్వనాథన్ పేర్కొన్నారు. కాగా చెన్నై జట్టు ఆగస్టు 21న ప్రత్యేక విమానంలో దుబాయ్‌కి వెళ్లింది.

అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బందికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సూపర్ కింగ్స్ మొత్తాన్ని మరోవారం క్వారంటైన్‌కు తరలించారు. సోమవారం అందరికీ పరీక్షలు నిర్వహించినప్పటకీ.. స్పష్టత కోసం గురువారం మరోసారి టెస్టులు చేశారు.

అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం దీపక్ చాహర్, రుతురాజ్‌కు మాత్రం 14 రోజుల ఐసోలేషన్‌ పూర్తయ్యాకే పరీక్షలు చేస్తామని విశ్వనాథన్ స్పష్టం చేశారు. దీంతో ధోనీ సేన శుక్రవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది. 

click me!