
ICC Champions Trophy 2025: పాకిస్తాన్ లోని లాహోర్ లో ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సూపర్ సెంచరీతో దుమ్మురేపాడు. 177 పరుగులు ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ బౌలింగ్ ను చిత్తుచేశాడు. అతని ఇన్నింగ్స్ సహాయంతో ఆఫ్ఘనిస్తాన్ సూపర్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో మొదట బ్యాటింగ్ చేసి 325/7 స్కోరు చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్‌ను 8 పరుగుల తేడాతో ఓడించి విజయం సాధించింది. ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో జోస్ బట్లర్ టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి ఔట్ అయింది. జో రూట్ ఆరు సంవత్సరాలలో తన తొలి ODI సెంచరీని సాధించాడు. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రూట్ 111 బంతుల్లో 11 బౌండరీలు, 1 సిక్సర్‌తో 120 పరుగులు చేశాడు, కానీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.
అంతకుముందు, ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 146 బంతుల్లో 177 పరుగులు చేసి సంచలనాత్మక ఇన్నింగ్స్ తో రికార్డుల మోత మోగించాడు. ICC ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్ గా ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ 165 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే, భారత క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీల రికార్డులు సైతం జద్రాన్ బద్దలు కొట్టాడు.
ఇది కూడా చదవండి- Champions Trophy : భారత్ కు బిగ్ షాక్.. రోహిత్, గిల్ లకు ఏమైంది?
ఇబ్రహీం జద్రాన్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. అతను దూకుడుగా క్రికెట్ ఆడటంతో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. సరైన ఫుట్‌వర్క్‌తో కవర్ డ్రైవ్, పుల్ షాట్, లాఫ్టెడ్ డ్రైవ్ వంటి షాట్‌లను చక్కగా ఆడగలడు. జద్రాన్ గొప్ప బలం ఏమిటంటే, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా తన ఆట తీరును మార్చుకుంటాడు. జట్టు ఎంత ఒత్తిడిలో ఉన్నా రాణించడం అతని గొప్ప బలం. పరిస్థితిని బట్టి వికెట్ కాపాడుకుంటేనే దూకుడుగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్. చాలా సార్లు ఇది నిరూపించాడు.
7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇబ్రహీం జద్రాన్ ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో 541 పరుగులు చేశాడు. 35 వన్డేల్లో 6 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో 51.06 సగటుతో 1,634 పరుగులు చేశాడు. 44 టీ20 మ్యాచ్‌ల్లో 1105 పరుగులు చేశాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం, దూకుడు ఆటతీరు, వివిధ పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యంతో జద్రాన్ క్రికెట్ ప్రపంచంలో తప్పక చూడవలసిన ఆటగాడిగా మారాడు.
ఇది కూడా చదవండి - Virat Kohli : విరాట్ కోహ్లీ బలహీనత ఏంటో తెలుసా?