Karun Nair: 8 ఏళ్ల తర్వాత టెస్ట్ బరిలోకి కరుణ్ నాయర్… ఇలాగైతే ఎలా సామీ

Published : Jun 22, 2025, 02:54 PM IST
Karun Nair

సారాంశం

Karun Nair: దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ఆటతో అదరగొట్టిన కరుణ్ నాయర్ 3,011 రోజులకు తర్వాత భారత టెస్ట్ జట్టులోకి వచ్చాడు. అయితే, హెడింగ్లీలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అతను నాలుగు బంతుల్లోనే డక్ అవుట్ అయ్యాడు.

India vs England: ఇంగ్లాండ్‌తో హెడింగ్లీ, లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు 471 పరుగులకు ఆలౌట్ అయింది. భారత టాపార్డర్ రాణించడంతో 450+ పరుగుల మార్కును దాటింది. టీమిండియా బ్యాటర్లు ముగ్గురు సెంచరీలు బాదారు. 

భారత జట్టు సాధించిన మూడు సెంచరీలలో శుభ్‌మన్ గిల్ 147 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 134 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే, యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ 101 పరుగుల సెంచరీ నాక్ ఆడాడు. కేఎల్ రాహుల్ 42 పరుగులు చేశాడు.

3 సెంచరీలు చేసినప్పటికీ భారత జట్టు 471 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ చివరలో 41 పరుగులకే 7 వికెట్లు కోల్పోవడంతో భారత్ 500+ పరుగుల మార్కును చేరుకోలేకపోయింది. ఐపీఎల్ 2025 తో పాటు దేశావాళీ క్రికెట్ లో దుమ్మురేపే ఇన్నింగ్స్ లు ఆడిన సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ లు అంచనాలు అందుకోలేకపోయారు. సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. కానీ, పరుగుల ఖాతా తెరవలేకపోయాడు.

3,011 రోజుల తర్వాత కరుణ్ నాయర్ రీఎంట్రీ కానీ..

దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న కరుణ్ నాయర్ గతంలో భారత జట్టులోకి వచ్చాడు. కానీ, ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో జట్టుకు దూరం అయ్యాడు. మళ్లీ దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ లో సత్తా చాటాడు. తన బ్యాట్ పవర్ చూపించాడు. దీంతో దాదాపు 8 సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు కరుణ్ నాయర్. కానీ, రీఎంట్రీలో తన తొలి ఇన్నింగ్స్‌లోనే ఘోరంగా విఫలమయ్యాడు.

ఇంగ్లాండ్‌తో హెడింగ్లీ, లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండవ రోజు (జూన్ 21) కరుణ్ నాయర్ కేవలం నాలుగు బంతులు ఎదుర్కొని డక్ అవుట్ అయ్యాడు. భారత జట్టు శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో బరిలోకి దిగగా, నాయర్ కు 6 స్థానంలో అవకాశం వచ్చింది.

స్టోక్స్ సూపర్ బౌలింగ్.. ఒలీ పోప్ కళ్లు చెదిరే క్యాచ్ తో కరుణ్‌ నాయర్ ఔట్‌

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన ఓవర్ చివరి బంతిని బయటి ఆఫ్ స్టంప్ వైపు స్వింగ్  చేయగా, కరుణ్ నాయర్ కవర్ డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ టైమింగ్ తప్పిపోయి, బంతి నేరుగా షార్ట్ కవర్‌లో ఉన్న ఒలీ పోప్ చేతికి చేరింది. అతను ఒక చేతితో భూమికి సమాంతరంగా డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్‌తో కరుణ్ నాయర్ ను ఔట్ చేశాడు. 

ఇది భారత తొలి ఇన్నింగ్స్ 105వ ఓవర్ చివరి బంతికి జరిగింది. దీంతో చాలా కాలం తర్వాత భారత జట్టులో చోటుదక్కించుకున్న కరుణ్ నాయర్ కు మరో బ్యాడ్ డేగా మిగిలిపోయింది.

 

 

కమెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానిస్తూ.. “ఇన్నింగ్స్ ప్రారంభంలో కవర్ డ్రైవ్‌కి వెళ్లడం ప్రమాదకరం. ఆ బంతిని స్లాష్ చేసి ఉంటే బాగుండేదేమో” అని అన్నారు. కరుణ్ నాయర్ ఔట్‌ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు అతని అవుట్ పై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు.

2016లో ట్రిపుల్ సెంచరీ తర్వాత… 8 ఏళ్ల విరామంతో జట్టులోకి కరుణ్ నాయర్

కరుణ్ నాయర్ చివరిసారిగా భారత టెస్ట్ జట్టులో 2017లో ఆడారు. 2016 డిసెంబర్‌లో చెన్నై టెస్టులో ఇంగ్లాండ్‌పై 303 పరుగులతో ట్రిపుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన తర్వాత అతని స్థానం గల్లంతైంది. అప్పటి నుంచి 402 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపిక కాకపోవడం ద్వారా అతను క్రికెట్‌లో అత్యధిక విరామం తర్వాత తిరిగి వచ్చిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

డొమెస్టిక్‌లో కరుణ్ నాయర్ అద్భుత ప్రదర్శన

దేశవాళీ క్రికెట్ లో కరుణ్ నాయర్ అద్భుతమైన ఆటతో మళ్లీ భారత జట్టులో చోటుదక్కించకున్నాడు. విదర్భ తరపున 2024–25 రంజీ ట్రోఫీలో 9 మ్యాచ్‌ల్లో 863 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. 

విజయ్ హజారే ట్రోఫీలో 8 ఇన్నింగ్స్‌లో 779 పరుగులు చేయగా, అందులో 5 సెంచరీలు సాధించి భారత సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనల ఆధారంగా అతన్ని ఇంగ్లాండ్ పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేసింది.

గవాస్కర్ చేతుల మీదుగా రికాల్ క్యాప్

ఇండియా 287వ టెస్ట్ క్రికెటర్‌గా కరుణ్ నాయర్ కు తిరిగి రికాల్ క్యాప్‌ను లెజెండరీ సునీల్ గవాస్కర్ అందజేశారు. ఈ మధుర క్షణాన్ని నాయర్ ఎప్పటికీ మర్చిపోలేదు.. కానీ, అయినా పిచ్‌పై కథ అలా సానుకూలంగా సాగలేదు. పరుగులు చేయకుండానే అవుట్ అయి నిరాశపరిచాడు.

అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ కానీ..

ఈ మ్యాచ్‌లోనే అరంగేట్రం చేసిన సాయి సుధర్శన్ కూడా నాలుగు బంతులకే ఔట్ కావడం గమనార్హం. ఇద్దరినీ డిస్మిస్ చేసింది ఇంగ్లాండ్ స్టార్ బెన్ స్టోక్స్.

 

 

తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులకు ఆలౌట్ అయిన భారత్ 

ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ భారత్ కు శుభారంభం అందించారు. కేఎల్ రాహుల్ 42 పరుగులు చేయగా,  జైస్వాల్ 101 పరుగలతో సెంచరీ కొట్టాడు. శుభ్ మన్ గిల్ 147 పరగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు. రిషబ్ పంత్ దూకుడుగా ఆడతూ 134 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భారత్ వద్దు.. పాక్ ముద్దు.. కేకేఆర్ ఆటగాడి సంచలన నిర్ణయం
ఇది కదా ఎగిరిగంతేసే వార్త అంటే.! టీ20ల్లోకి హిట్‌మ్యాన్ రీ-ఎంట్రీ