Kartik Tyagi: కార్తీక్.. అచ్చం నీరజ్ చోప్రాలా ఉన్నాడే..!

Published : Sep 23, 2021, 07:50 AM ISTUpdated : Sep 23, 2021, 07:57 AM IST
Kartik Tyagi:  కార్తీక్.. అచ్చం నీరజ్ చోప్రాలా ఉన్నాడే..!

సారాంశం

 ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో.. ఈ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా వచ్చి ఆడాడా అనే సందేహం చాలా మందిలో కలిగింది., అందుకు కారణం.. రాజస్థాన్ రాయల్స్ సంచలనం కార్తీక్ త్యాగి( kartik Tyagi).

టోక్యో ఒలంపిక్స్ (Tokyo Olympics) తర్వాత ఎక్కడ విన్నా గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్రా పేరే వినపడింది. దేశానికి 100ఏళ్ల బంగారు కల నేరవేర్చడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే.. తాజాగా ఐపీఎల్(IPL 2021) లో కూడా నీరజ్ చోప్రా పేరు వినపడటం విశేషం. ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో.. ఈ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా వచ్చి ఆడాడా అనే సందేహం చాలా మందిలో కలిగింది., అందుకు కారణం.. రాజస్థాన్ రాయల్స్ సంచలనం కార్తీక్ త్యాగి( kartik Tyagi).

ఇంతకీ మ్యాటరేంటంటే.. మంగళవారం రాత్రి పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కార్తీక్ అద్భుత ప్రదర్శన కనపరిచిన సంగతి తెలిసిందే, పంజాబ్ చివరి ఓవర్ లో నాలుగు పరుగులు అవసరం కాగా,. ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి,. రెండు వికెట్లు తీశాడు, దీంతో రాజస్థాన్ రాయల్స్ కి ఊహించని విజయం దక్కింది.

 

దుబాయ్ స్టేడియం ఒక్కసారిగా దంచి కొట్టిన ఈ ఆటగాడు లుక్స్ మాత్రం.. అచ్చం ఒలంపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాలా ఉండటం విశేషం. దీంతో.. ఐపీఎల్ నీరజ్ చోప్రా ఉన్నాడా అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. లేకపోతే నీరజ్, కార్తీక్.. ఇద్దరూ బ్రదర్సా అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం విశేషం, వీరిద్దరూ ట్విన్ బ్రదర్స్ లా ఉన్నారంటూ నెటిజన్లుు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.  నిజానికి వీరిద్దరికీ ఎలాంటి సంబంధం లేకపోవడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?