
IPL 2021 సీజన్ ఫేజ్ 2లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్లు కిక్ అందించింది రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్. ఈ భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో భారత యంగ్ బౌలర్ కార్తీక్ త్యాగి మ్యాజిక్ స్పెల్ కారణంగా ఆఖరి ఓవర్‌లో 4 పరుగులను కాపాడుకుని 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది రాజస్థాన్ రాయల్స్...
అయితే ఈ మ్యాచ్ చూసిన వారెవ్వరైనా పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగినట్టు అర్థమవుతుంది. మ్యాచ్ ముగిసేసమయానికి దాదాపు 12 కావచ్చొంది. దీంతో స్లో ఓవర్ రేటు కారణంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కి రూ.12 లక్షల జరిమానా విధించింది ఐపీఎల్ యాజమాన్యం...
ఈ విజయంతో సీజన్‌లో నాలుగో విజయం అందుకున్న రాజస్థాన్ రాయల్స్, పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది... మిగిలిన ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకుంటే రాజస్థాన్, ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తుంది...
ఫస్టాఫ్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఆఖరి ఓవర్ ఆఖరి బంతివరకూ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే ఆ మ్యాచ్‌లో ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సిన దశలో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు సంజూ శాంసన్...