
IPL2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో ఏడో ఓటమి చేరింది. ఫేజ్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లో వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 8 మ్యాచుల్లో ఏడు పరాజయాలతో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది...
135 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్... 20 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 8 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన పృథ్వీషా, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో కేన్ విలియంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ కలిసి రెండో వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.. 37 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసిన శిఖర్ ధావన్... రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
72 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్... ఆ తర్వాత రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ కలిసి లాంఛనాన్ని పూర్తిచేశారు. రిషబ్ పంత్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 41 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు.
ఈ విజయంతో ఏడో విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది. మిగిలిన ఐదు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే, మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ఫ్లేఆఫ్ చేరుకుంటుంది ఢిల్లీ క్యాపిటల్స్...