IPL 2021: రాజస్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విన్... కార్తీక్ త్యాగి ఆఖరి ఓవర్ మ్యాజిక్...

By Chinthakindhi RamuFirst Published Sep 21, 2021, 11:48 PM IST
Highlights

విజయం అంచుల దాకా వచ్చి బోల్తా పడిన పంజాబ్ కింగ్స్... ఆఖరి ఓవర్‌లో రెండు వికెట్లు తీసి మ్యాజిక్ చేసిన కార్తీక్ త్యాగి...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. ఫస్టాఫ్‌లో సాగినట్టుగానే పంజాబ్, రాజస్థాన్ మధ్య హై స్కోరింగ్ గేమ్‌లో హోరాహోరీ గేమ్ సాగింది... రాయల్స్ ప్లేయర్లు క్యాచ్‌లను డ్రాప్ చేయడంతో ఆ అవకాశాలను చక్కగా వినియోగించుకుని ఈజీ విజయం దిశగా సాగిన పంజాబ్ కింగ్స్... ఆఖరి ఓవర్‌లో కార్తీక్ త్యాగి మ్యాజిక్ ముందు నిలవలేక 2 పరుగుల తేడాతో ఓడింది.


రాజస్థాన్ రాయల్స్ విధించిన 186 పరుగుల లక్ష్యఛేదనను ప్రారంభించిన పంజాబ్ కింగ్స్‌కి ఓపెనర్లు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మొదటి వికెట్‌కి 120 పరుగుల భాగస్వామ్యం అందించారు... ఆరంభంలో కెఎల్ రాహుల్ ఇచ్చిన మూడు మ్యాచులను నేలవిడిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డర్లు, భారీ మూల్యం చెల్లించుకున్నారు...


33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ను చేతన్ సకారియా అవుట్ చేయగా, మయాంక్ అగర్వాల్ 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...


కెఎల్ రాహుల్ 3 వేల ఐపీఎల్ పరుగులను పూర్తి చేసుకోగా, మయాంక్ అగర్వాల్ 2 వేల ఐపీఎల్ రన్స్‌ మైలురాయి అందుకున్నాడు. 75 ఇన్నింగ్స్‌ల్లో 3 వేల ఐపీఎల్ పరుగులు అందుకున్న కెఎల్ రాహుల్, అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...


కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాత మార్క్‌రమ్, నికోలస్ పూరన్ కలిసి మ్యాచ్‌ను ముగించినంత పని చేశారు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖరి రెండు ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు.

19వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ 4 పరుగులు మాత్రమే ఇవ్వగా, ఆఖరి ఓవర్‌లో విజయానికి 4 పరుగులు కావాల్సిన దశలో ఒకే ఒక్క పరుగు ఇచ్చిన కార్తీక్ త్యాగి రెండు వికెట్లు తీసి.. రాజస్థాన్ రాయల్స్‌కి ఉత్కంఠ విజయం అందించాడు...

click me!