భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను 1983లో అందించిన కపిల్ దేవ్.. ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్ కు అప్పటి తమ జట్టు మొత్తాన్ని పిలుస్తారని అనుకున్నానన్నారు.
అహ్మదాబాద్ : భారత్ కు మొట్ట మొదటి ప్రపంచకప్ అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ను బీసీసీఐ అవమానించింది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ 2023 మ్యాచ్ ఫైనల్ కు ఆహ్వానించలేదు. ఈ మేరకు ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌కు తనను ఆహ్వానించలేదని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆదివారం చెప్పుకొచ్చారు. 1983లో భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను అందించిన కపిల్, అప్పటి తమ టీం అందరినీ ప్రపంచకప్ ఫైనల్ కు ఆహ్వానిస్తారని అనుకున్నానని తెలిపారు.
“నన్ను ఎవ్వరూ ఆహ్వానించలేదు. సింపుల్ గా వారు నన్ను పిలవలేదు కాబట్టి నేను వెళ్ళలేదు’ అన్నారు. 83 టీమ్ మొత్తాన్ని నాతో సహా ఇవ్వాళ్టి ఫైనల్ కి పిలుస్తారని అనుకున్నాను. కానీ, ఇది చాలా పెద్ద ఈవెంట్, క్రికెట్ పెద్దలు బాధ్యతల్లో ఎంతో బిజీగా ఉండటం వల్ల పిలవడం మరచిపోయి ఉంటారు ”అని కపిల్ ఏబీపీ న్యూస్‌తో అన్నారు.
Rohit Sharma: " ఆ ఇద్దరి వల్లే పరాజయం.. ఇంకో 20-30 పరుగులు చేసి ఉంటే.. "
నరేంద్ర మోడీ స్టేడియంకు హాజరైన ఇతర మాజీ భారత కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ కూడా ఉన్నారు. బిసిసిఐ మాజీ అధ్యక్షుడి హోదాలో ఈ గేమ్ కు సౌరవ్ గంగూలీకి ఆహ్వానం అందింది. మాజీ అధ్యక్షులు, అధికారులను ఆహ్వానించడం బీసీసీఐ ఆనవాయితీగా వస్తుంది. హై ప్రొఫైల్ గేమ్‌కు హాజరైన ఇతర ప్రముఖుల్లో నటులు షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, బ్యాడ్మింటన్ గ్రేట్ ప్రకాష్ పదుకొణె స్టాండ్స్‌లో కూర్చుని కనిపించారు.
ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐసిసి ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో ఫైనల్‌లో, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో భారత్ ఆస్ట్రేలియాపై 240 పరుగులకు ఆలౌటైంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా టాస్ గెలిచి, మొదట బ్యాటింగ్‌ని ఎంచుకుంది.
కెప్టెన్ రోహిత్ శర్మ ధాటిగా 47 పరుగులు చేసిన తర్వాత, విరాట్ కోహ్లి 54, కేఎల్ రాహుల్ వరుసగా 54, 66 పరుగులు చేశారు. స్లగ్గిష్, డ్రై పిచ్ మీద.. బ్యాట్‌పై బంతి ఆధిపత్యం చెలాయించింది.
Kapil Dev Not invited to World Cup Finals pic.twitter.com/zLRDB8ASdd
— Veer Wolf (@wolfbaaz)