
టీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. వ్యాక్సిన్ తీసుకోవడమే అందుకు కారణం. అదేంటి టీకా తీసుకోవడం స్వాగతించాల్సిన విషయమే కదా..? అని మీకు డౌట్ రావొచ్చు. అందుకు సమాధానం దొరకాలంటే అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.
కాగా దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకా ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ తన నివాసానికి దగ్గరలో వున్న గోవింద్‌నగర్ జగదీశ్వర్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాడు.
అయితే, ఆస్పత్రికి వెళ్లకుండా కాన్పూర్ నగర్ నిగం గెస్ట్ హౌస్‌లో టీకా తీసుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఇందుకు సంబంధించిన ఫొటోలను కుల్దీప్ ట్విటర్‌లో షేర్ చేశాడు. కోవిడ్‌పై పోరులో అంతా ఒక్కటి కావాలని, అవకాశం ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా టీకా వేయించుకోవాలని సూచించాడు.
Also Read:డేట్‌కెళ్లా.. ఆమెను చూసి 5 నిమిషాల్లో పారిపోయా, కోహ్లీ వీడియో వైరల్
అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ పోస్టు కాన్పూర్ జిల్లా యంత్రాంగం కంటపడింది. ఈ నేపథ్యంలో తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వ్యవహరించిన కుల్దీప్‌పై ఆగ్రహానికి గురయ్యారు. అక్కడితో ఆగకుండా ఈ ఘటనపై కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ అలోక్ తివారి విచారణకు ఆదేశించారు.
ఎవరి అనుమతితో గెస్ట్‌హౌజ్‌లో కుల్దీప్ టీకా తీసుకున్నాడనే అంశంపై ఆరా తీస్తున్నారు. కాగా ఫ్రాంచైజీల్లోని ఆటగాళ్లు ఒక్కొక్కరిగా కోవిడ్ బారినపడుతుండటంతో ఐపీఎల్-2021ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో కుల్దీప్ యాదవ్ ఇంటికి చేరుకున్నాడు. మరోవైపు ప్రపంచం టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు.