2011 ఇండియాలో ప్రపంచకప్... నన్ను, నా భార్యను చంపేస్తామన్నారు: డుప్లెసిస్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 19, 2021, 5:51 PM IST
Highlights

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2011 ప్రపంచకప్‌ సమయంలో తనను, తన భార్యను చంపేస్తామంటూ బెదిరించారని గుర్తుచేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వన్డే వరల్డ్‌కప్‌-2011లో భాగంగా బంగ్లాదేశ్‌లోని ఢాకాలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ మధ్య మూడో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2011 ప్రపంచకప్‌ సమయంలో తనను, తన భార్యను చంపేస్తామంటూ బెదిరించారని గుర్తుచేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వన్డే వరల్డ్‌కప్‌-2011లో భాగంగా బంగ్లాదేశ్‌లోని ఢాకాలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ మధ్య మూడో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన డేనియల్‌ వెటోరి సారథ్యంలోని కివీస్‌ నిర్దిష్ట 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది.  లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కేవలం 172 పరుగులే చేసి భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.

దీనితో పాటు అదే మ్యాచ్‌లో డుప్లెసిస్‌, న్యూజిలాండ్ ఆటగాడు కైల్‌ మిల్స్‌ను నెట్టివేయడం విమర్శలకు దారి తీసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐసీసీ.. అతడి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించింది.  నాటి విషయాలను గుర్తు చేసుకున్న డుప్లెసిస్‌ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించగానే దక్షిణాఫ్రికా జట్టుపై విమర్శల వర్షం కురిసిందని తెలిపాడు.

Also Read:ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అంతే, అదే ఫైనల్... కమ్‌బ్యాక్‌పై సంచలన నిర్ణయం ప్రకటించిన ఏబీ డివిల్లియర్స్...

నన్ను, నా భార్యను చంపేస్తామంటూ బెదిరించడంతో పాటు సోషల్ మీడియా నిండా అసభ్యకరమైన కామెంట్లు కనిపించాయని డుప్లెసిస్ చెప్పాడు. మళ్లీ ఇలాగే ఆడితే పరిణామాలు తీవ్రంగా వుంటాయంటూ కొందరు హచ్చరించినట్లు గుర్తుచేసుకున్నాడు. 

ప్రతి క్రికెటర్ జీవితంలో ఇలాంటివి సహజమని డుప్లెసిస్ అన్నాడు.  అయితే కఠినంగా శ్రమిస్తే సత్ఫలితాలు వస్తాయని.. తానూ అదే చేశానని అతను చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డుప్లెసిస్‌.. కరోనా కారణంగా టోర్నీ వాయిదా పడటంతో స్వదేశానికి వెళ్లాడు. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లలో 320 పరుగులు చేశాడు. 

click me!