Hyderabad: థర్డ్ అంపైర్ సిగ్నల్‌కు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు టాయిలెట్‌తో పోలిక.. జాంటీ రోడ్స్ ట్వీట్ వైరల్

By Mahesh K  |  First Published Dec 16, 2023, 7:19 PM IST

థర్డ్ అంపైర్ సిగ్నల్‌ను హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాయిలెట్ల నిర్వహణకు ఉపయోగించిన లైట్లతో పోల్చారు ప్రముఖ క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్. థర్డ్ అంపైర్‌లు రెడ్, గ్రీన్ లైట్లను ఉపయోగించినట్టే.. ఎయిర్‌పోర్టు టాయిలెట్‌లోపల ఎవరైనా ఉన్నారా? ఖాళీగా ఉన్నదా? అనేది తెలియజేయడానికి ఈ థర్డ్ అంపైర్ తీరులోనే లైటింగ్ సిస్టమ్‌తో పోల్చారు.
 


హైదరాబాద్: దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. తరుచూ ఆయన అభిమానులకు సమాధానాలు ఇస్తున్నారు. కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతున్నది. క్రికెట్‌లో థర్డ్ అంపైర్ సిగ్నల్‌ను హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టు టాయిలెట్ సిగ్నల్‌తో సరదా పోలిక తీశారు.

Looks like the toilets at the new (and impressive) Hyderabad International Airport have adopted the 3rd umpire referral system to indicate whether users are in or out pic.twitter.com/IoeNPOG5Nf

— Jonty Rhodes (@JontyRhodes8)

Also Read : Year Ender 2023: వన్డేల్లో కోహ్లీ, రోహిత్‌ను వెనక్కి నెట్టిన శుభ్‌మన్ గిల్

Latest Videos

క్రికెట్‌లో థర్డ్ అంపైర్‌లో ఔట్ లేదా నాటౌట్ అనే విషయాన్ని వెల్లడించడానికి రెడ్ లేదా గ్రీన్ కలర్‌ లైట్స్ ద్వారా సిగ్నల్ ఇచ్చారు. ఇదే కలర్ లైట్‌ల ద్వారా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు టాయిలెట్లకూ ఉపయోగిస్తున్నారని, ఆ టాయిలెట్‌లో వ్యక్తి ఉన్నారా? ఖాళీగా ఉన్నదా? అని చెప్పడానికి ఈ కలర్ లైట్లను వినియోగిస్తున్నట్టు వివరించారు. థర్డ్ అంపైర్ రిఫరల్ సిస్టమ్‌ను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు టాయిలెట్‌ల నిర్వహణకు ఉపయోగిస్తున్న లైట్లతో పోల్చారు. హైదరాబాద్‌లోని నూతన అంతర్జాతీయ విమానాశ్రయం ఇంప్రెస్సివ్‌గా ఉన్నదని కామెంట్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. వారి ట్వీట్లకూ జాంటీ రోడ్స్ రిప్లై ఇస్తుండటం గమనార్హం.

click me!