ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్డిక్ పాండ్యాను నియమిస్తూ ముంబై ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై రోహిత్ అభిమానులు, ముంబై మద్ధతుదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు, ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్డిక్ పాండ్యాను నియమిస్తూ ముంబై ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై రోహిత్ అభిమానులు, ముంబై మద్ధతుదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. అంతేకాదు.. ముంబై ఇండియన్స్‌ని సోషల్ మీడియాలో అనుసరించే వారు కూడా తగ్గిపోతున్నారు. కొందరు అభిమానులైతే రోహిత్ శర్మ కోసం ముంబైని ఫాలో అవుతున్నామని కామెంట్స్ చేస్తున్నారు.
రోహిత్ శర్మ కెప్టెన్‌గా వున్నప్పుడు ముంబై ఇండియన్స్ ఎక్స్ (ట్విట్టర్)కు 8.6 మిలియన్ల మంది ఫాలోవర్లు వుండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య 8.2 మిలియన్లకు పడిపోయింది. గంటల వ్యవధిలో ఏకంగా 4 లక్షల మంది ఫాలోవర్లు ముంబైని వీడారు. అటు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఇదే పరిస్ధితి. ఇప్పటికే 1.5 లక్షల మంది ఇన్‌స్టా ఫాలోవర్లను కోల్పోయింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 12.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ సీజన్‌లో కనుక రోహిత్ ముంబై తరపున ఐపీఎల్ ఆడకపోతే ముంబై మరింత మంది ఫాలోవర్లు కోల్పోయే ప్రమాదం వుంది.
ALso Read: ఐపీఎల్ 2024: ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హర్ధిక్ పాండ్యా
కాగా.. శుక్రవారం ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ గా హర్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. ఈ నెల ప్రారంభంలో గుజరాత్ టైటాన్ నుండి ముంబై ఇండియన్స్ ప్రాంచైజీకి హర్ధిక్ పాండ్యా వచ్చాడు. గతంలో ముంబై జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండేవాడు. 2013, 2015, 2017, 2019, 2020లలో అతని సారథ్యంలోనే ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ ను సాధించింది.