టీ20 సిరీస్‌కి ముందు ఇంగ్లాండ్ జట్టుకి ఊహించని షాక్... స్టార్ పేసర్ అవుట్...

Published : Mar 08, 2021, 07:07 PM IST
టీ20 సిరీస్‌కి ముందు ఇంగ్లాండ్ జట్టుకి ఊహించని షాక్... స్టార్ పేసర్ అవుట్...

సారాంశం

మోచేతి గాయంతో బాధపడుతున్న జోఫ్రా ఆర్చర్... టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు డౌట్... మార్చి 12 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్...

టెస్టు సిరీస్‌‌ను 1-3 తేడాతో కోల్పోయిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకి, టీ20 సిరీస్ ఆరంభానికి ముందు ఊహించని షాక్ తగిలింది. మోచేతి గాయంతో ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్, టీ20 సిరీస్ నుంచి దూరమయ్యాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండు టెస్టులు ఆడిన ఆర్చర్, పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. 

శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో లేని జోఫ్రా ఆర్చర్, టీమిండియా సిరీస్ కోసం బెన్‌స్టోక్స్, రోరీ బర్న్స్‌తో కలిసి నేరుగా భారత్‌కి చేరుకున్నాడు... తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌ను అవుట్ చేసిన ఆర్చర్, రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రాను పెవిలియన్ చేర్చాడు.

అయితే రొటేషన్ పద్ధతి కారణంగా రెండో టెస్టు ఆడని ఆర్చర్, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మాత్రమే బౌలింగ్ చేసి శుబ్‌మన్ గిల్ వికెట్ తీశాడు. మార్చి 12 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్, 20న జరిగే ఐదో టీ20తో ముగుస్తుంది. 

PREV
click me!

Recommended Stories

RCB : ఆర్సీబీ మాస్ బ్యాటింగ్.. యూపీ బౌలర్లకు చుక్కలే ! గ్రేస్ హారిస్ సునామీ ఇన్నింగ్స్
Sophie Shine : రోహిత్ శర్మ నిద్ర చెడగొట్టిన ఆ అమ్మాయి ఈమేనా? ధావన్ లవ్ స్టోరీ మామూలుగా లేదుగా!