ఏడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనున్న టీమిండియా... బీసీసీఐ సెక్రటరీ అధికారిక ప్రకటన...

Published : Mar 08, 2021, 06:49 PM IST
ఏడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనున్న టీమిండియా... బీసీసీఐ సెక్రటరీ అధికారిక ప్రకటన...

సారాంశం

2014లో చివరిసారిగా సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఆడిన భారత మహిళా జట్టు... 2006 నుంచి 2014 వరకూ మూడు టెస్టులాడి, మూడింట్లోనూ విజయాలు సాధించిన టీమిండియా... ఏడేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడనున్న భారత జట్టు..

భారత పురుషుల క్రికెట్ జట్టు వరుస విజయాలతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి వెళితే, మహిళల జట్టు మాత్రం ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడి ఏడేళ్లు అయ్యింది. ఎట్టకేలకు వచ్చే ఏడాది టెస్టు మ్యాచ్ ఆడనుంది భారత జట్టు.

ఇంగ్లాండ్‌తో టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడుతుందని ప్రకటించాడు బీసీసీఐ సెక్రటరీ జే షా. భారత వన్డే సారథి మిథాలీసేన సారథ్యంలో చివరిసారిగా 2014లో సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఆడింది టీమిండియా.

2006 నుంచి మూడు టెస్టులు ఆడిన టీమిండియా, మూడింట్లోనూ గెలిచింది. ఇప్పుడు వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు గెలిస్తే, వరుసగా నాలుగు టెస్టులు గెలిచిన ఏకైక జట్టుగా నిలుస్తుంది భారత జట్టు...

PREV
click me!

Recommended Stories

RCB : ఆర్సీబీ మాస్ బ్యాటింగ్.. యూపీ బౌలర్లకు చుక్కలే ! గ్రేస్ హారిస్ సునామీ ఇన్నింగ్స్
Sophie Shine : రోహిత్ శర్మ నిద్ర చెడగొట్టిన ఆ అమ్మాయి ఈమేనా? ధావన్ లవ్ స్టోరీ మామూలుగా లేదుగా!