వుమెన్స్ డే సందర్భంగా భార్యా, కూతురు ఫోటోను పోస్టు చేసిన విరాట్ కోహ్లీ... అమ్మలా ఎదగాలంటూ...

Published : Mar 08, 2021, 12:19 PM IST
వుమెన్స్ డే సందర్భంగా భార్యా, కూతురు ఫోటోను పోస్టు చేసిన విరాట్ కోహ్లీ... అమ్మలా ఎదగాలంటూ...

సారాంశం

భార్య అనుష్క శర్మకు, కూతురు వామికకు వుమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ విరాట్ ఎమోషనల్ పోస్ట్... ఓ బిడ్డకి జన్మనివ్వడం చూడడం కూడా వెన్నులో వణుకు పుట్టించే విషయమే... వామిక, తన తల్లిలా శక్తివంతంగా మారాలని కోరుకుంటున్నానంటూ... 

భారత సారథి విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మకు, కూతురు వామికకు వుమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ బిడ్డతో ఆడుతున్న అనుష్క ఫోటోను పోస్టు చేశాడు.

‘ఓ బిడ్డకి జన్మనివ్వడం చూడడం కూడా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మనిషి జీవితంలో నమ్మశక్యం కాని, ఓ అద్భుతమైన అనుభవం అది. తల్లి ప్రసవ వేదనను దగ్గర్నుంచి చూస్తే మహిళల నిజమైన శక్తి, దైవత్వం తెలుస్తుంది. దేవుడే వారి లోపల ఓ జీవితాన్ని నిర్మించాడు.

 

ఎందుకంటే వాళ్లు మన కంటే (మగవాళ్లకంటే) బలమైన వాళ్లు. నా జీవితంలో ఎంతో అమూల్యమైన దృఢమైన మహిళలకు హ్యాపీ వుమెన్స్ డే... వామిక కూడా తల్లిగా ఎదగాలని కోరుకుంటున్నా... మహిళా ప్రపంచానికి వుమెన్స్ డే శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు విరాట్ కోహ్లీ...

 

PREV
click me!

Recommended Stories

Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !
Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు